53 ఎర్రచందనం దుంగలు స్వాధీనం, 3 స్మగ్లర్లు అరెస్ట్

వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ (RSASTF) శనివారం 53 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుంది మరియు 3 స్మగ్లర్లు మరియు ఒక ద్విచక్రవాహనాన్ని అరెస్టు చేసింది. టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌చార్జి, తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ పి.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కడప సబ్‌ కంట్రోల్‌ ఆర్‌ఎస్‌ఐ నరేష్‌ తన బృందంతో కలిసి ఖాజీపేట అటవీ డివిజన్‌లోని ప్రొద్దుటూరు పరిధిలో కూంబింగ్‌ ప్రారంభించారు. నాగసాని పల్లి పరిధి పోతభక్తుని భావి సమీపంలోకి రాగా.. కొందరు స్మగ్లర్లు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గమనించారు. పోలీసులు వారిని చుట్టుముట్టడంతో స్మగ్లర్లు వాహనాన్ని వదిలి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు ముగ్గురు వ్యక్తులను పట్టుకోగా మరికొందరు పరారయ్యారు. నిందితుల నుంచి 53 దుంగలను టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిని గురుప్రసాద్ (37), వెంకటేష్ (24), బత్తల శివ (25)గా గుర్తించారు. దుంగలతో పాటు ఒక ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

About The Author: న్యూస్ డెస్క్