విజయవాడ సెక్షన్‌లో ఆగస్టు 11 వరకు పలు రైళ్లను రద్దు.

ఏపీలోని విజయవాడ డివిజన్‌ పరిధిలో పలు రైళ్ల సర్వీసులను రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రైల్వే లైన్ల ఆధునీకరణ పనులకు సంబంధించి జూన్ 24 నుండి ఆగస్టు 11 వరకు అనేక ప్యాసింజర్ మరియు ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.

విశాఖ - గుంటూరు (17240) సింహాద్రి, 
గుంటూరు - విశాఖ (17239) సింహాద్రిని, 
విశాఖ - తిరుపతి 22707) డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్, 
విశాఖ - విజయవాడ (12717) రచ్చల్ ఎక్స్‌ప్రెస్, 
రాజమండ్రి - విశాఖ (07466) ప్యాసింజర్ (07466) 
విజయవాడ -విశాఖ (12718) రచ్చల్ ఎక్స్‌ప్రెస్, 
గుంటూరు-విశాఖ (22702) ఉదయ్ ఎక్స్‌ప్రెస్, 
విశాఖ-గుంటూరు (22701) ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రద్దు చేయబడ్డాయి.

అదేవిధంగా ఈ నెల 23 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు మచిలీపట్నం-విశాఖ (17219), 
విశాఖ-మచిలీపట్నం (17220) ఎక్స్‌ప్రెస్, 
గుంటూరు-రాయగఢ్ (17243), 
విశాఖ-లింగంపల్లి (12805) జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు. 

రేగడ-గుంటూరు (17244), 

లింగంపల్లి-విశాఖ (12806) జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లను ఈ నెల 24 నుంచి ఆగస్టు 11 వరకు రద్దు చేశారు.

 తిరుపతి-విశాఖ డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్ (22708) ఈ నెల 24 నుంచి ఆగస్టు 9 వరకు రద్దు చేసిన సర్వీసుల జాబితాలో ఉంది.

About The Author: న్యూస్ డెస్క్