ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన పాలనను అమలు చేసేందుకు అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. ఈసారి కూడా సచివాలయంలో తన ప్రస్థానాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సచివాలయంలో అందుబాటులో ఉంటానని తనను కలిసిన పలువురికి చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. గతంలో మాదిరిగానే ఈసారి కూడా సచివాలయంలో నిరంతరం అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తానని చెప్పారని అనుకుంటున్నారు.
మంత్రులకు ఆదేశాలు
సచివాలయ బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించుకోని సీఎం చంద్రబాబు.. కేబినెట్ మంత్రులకు కూడా కీలక సూచనలు చేశారు. మంత్రులు ప్రతిరోజు సచివాలయానికి రావాలని, షెడ్యూల్ కూడా కచ్చితంగా పాటించాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. తమ శాఖలపై మంచి నియంత్రణ ఉండాలని, నిర్వహణపై పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. సచివాలయంలో తనను కలిసిన మంత్రులకు ఆయన ఈ మేరకు సూచన చేసినట్లు సమాచారం.