ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం త్వరలో ప్రారంభిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం త్వరలో ప్రారంభిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు

ఏపీలో టీడీపీ కూటమి ఎన్నికల హామీల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం ఒకటి. దీనిపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. 

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అతి త్వరలో ప్రారంభిస్తామని, దీనికి సంబంధించి ప్రకటన వెలువడుతుందని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమం ఎవరికీ ఇబ్బంది లేకుండా పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. 

ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని కర్ణాటక, తెలంగాణల్లో కూడా అమలు చేస్తామని, అయితే అక్కడ తలెత్తే లోపాలు ఏపీలో తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ, ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. 

తనకు మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు బాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. తాను తలపెట్టిన శాఖలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని విధాలా కృషి చేస్తానన్నారు. మంత్రిగా మందపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.

Tags:

తాజా వార్తలు

2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా  2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా
యూఎస్‌ఏ, వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు విజయాన్ని అందించిన తర్వాత ఇటీవలే టీ20ల నుంచి రిటైరయిన రోహిత్ శర్మ వచ్చే ఏడాది జరగబోయే రెండు ముఖ్యమైన...
నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలు, ముగింపు ఫ్లాట్; మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్, FMCG పతనం
శ్రీలంక LPG కంపెనీ మరియు టెర్మినల్ కోసం ఎనిమిది మంది బిడ్డర్లలో భారత్ పెట్రోలియం
భారతదేశంలో కొత్త కొడియాక్, ఆక్టేవియాను పరిచయం చేయడానికి స్కోడా సిద్ధమైంది
IRFC, RVNL మరియు IRCTC వంటి రైల్వే స్టాక్‌లు నేడు ఎందుకు లాభపడుతున్నాయి??
ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వీపీ హేమంత లాంబా రాజీనామా
'మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తాం': వినియోగదారులు గ్లిచ్ తర్వాత జెరోధాను