వాతావరణ శాఖ చల్లని కబురు

వాతావరణ శాఖ చల్లని కబురు

ఈ వేసవిలో దేశమంతా ఎండలు మండిపోతున్నాయి. వడగళ్ల వాన, వరదలతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ సమయంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగా దేశంలోకి రానున్నాయని ప్రకటించారు. వచ్చే 5 రోజుల్లో... రుతుపవనాలు ఈ నెల 19 నాటికి దక్షిణ అండమాన్, నికోబార్ దీవులు, ఆగ్నేయ బెంగాల్‌కు చేరుకుంటాయి.

అల్పపీడనం ఇప్పుడు దక్షిణ కర్ణాటక నుంచి వాయువ్య మధ్యప్రదేశ్ వరకు విస్తరించి ఉంది. ఏపీలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు వడగాలుల ప్రభావం ఉండదని వెల్లడించింది. కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిన్న పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ప్రకాశం జిల్లా బల్లిపల్లిలో అత్యధికంగా 79 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో గరిష్ట ఉష్ణోగ్రత 41.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

తాజా వార్తలు

2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా  2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా
యూఎస్‌ఏ, వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు విజయాన్ని అందించిన తర్వాత ఇటీవలే టీ20ల నుంచి రిటైరయిన రోహిత్ శర్మ వచ్చే ఏడాది జరగబోయే రెండు ముఖ్యమైన...
నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలు, ముగింపు ఫ్లాట్; మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్, FMCG పతనం
శ్రీలంక LPG కంపెనీ మరియు టెర్మినల్ కోసం ఎనిమిది మంది బిడ్డర్లలో భారత్ పెట్రోలియం
భారతదేశంలో కొత్త కొడియాక్, ఆక్టేవియాను పరిచయం చేయడానికి స్కోడా సిద్ధమైంది
IRFC, RVNL మరియు IRCTC వంటి రైల్వే స్టాక్‌లు నేడు ఎందుకు లాభపడుతున్నాయి??
ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వీపీ హేమంత లాంబా రాజీనామా
'మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తాం': వినియోగదారులు గ్లిచ్ తర్వాత జెరోధాను