ఇంకా ఓటర్‌ స్లిప్‌ తీసుకోలేదా.. ఇలా మీ మొబైల్‌లోనే డౌన్‌లోడ్‌ చేసుకోండి!

ఇంకా ఓటర్‌ స్లిప్‌ తీసుకోలేదా.. ఇలా మీ మొబైల్‌లోనే డౌన్‌లోడ్‌ చేసుకోండి!

 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. మరికొద్ది గంటల్లో ఎన్నికల పోలింగ్‌ మొదలవ్వనుండటంతో హైదరాబాద్‌ నగరంలో ఉన్న ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే చాలామంది తమ ఓటర్‌ స్లిప్‌లను కూడా అందుకున్నారు. మన పోలింగ్‌ సెంటర్‌ ఏంటి? ఆ స్టేషన్‌లో మన రూమ్‌ నంబర్‌, సీరియల్‌ నంబర్‌ ఎంత అనే వివరాలు ఈ ఓటర్‌ స్లిప్‌లో ఉంటాయి కాబట్టి ఓటు వేసేయడం చాలా సులభమవుతుంది. అందుకే ఎన్నికలప్పుడు ఓటర్‌ స్లిప్‌ తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే.. మీకు ఈ ఓటర్‌ స్లిప్‌ అందలేదా? అయితే టెన్షన్‌ పడాల్సిన అవసరమేమీ లేదు.. మీ చేతిలో ఉన్న మొబైల్‌ ద్వారానే ఓటర్‌ స్లిప్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

మొబైల్‌ బ్రౌజర్‌ ద్వారా..

కంప్యూటర్‌ లేదా మొబైల్‌ బ్రౌజర్‌ నుంచి ఓటర్‌ స్లిప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే ముందుగా https://electoralsearch.eci.gov.in/ లింక్‌పై క్లిక్‌ చేయాలి. అక్కడ ఓటర్‌ స్లిప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. ఓటర్‌ ఐడీ, మొబైల్‌ నంబర్‌ లేదా పేరు, ప్రాంతం వంటి వివరాలను ఎంటర్‌ చేయడం ద్వారా ఓటర్‌ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. పీడీఎఫ్‌ రూపంలో ఓటర్‌ స్లిప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అలా డౌన్‌లోడ్‌ చేసుకున్న ఓటర్‌ స్లిప్‌ను ప్రింట్‌ తీసుకుంటే సరిపోతుంది.

మొబైల్‌ యాప్‌లో..

ఇక మొబైల్‌ యాప్‌ ద్వారా ఓటర్‌ స్లిప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే.. మీ ఆండ్రాయిడ్‌ లేదా యాపిల్‌ మొబైల్‌లో ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అందులో ఎలక్టోరల్‌ రోల్‌ సెర్చ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి వివరాలు నమోదు చేయడం ద్వారా ఓటర్‌ స్లిప్ పొందవచ్చు. మొబైల్‌ నంబర్‌, ఓటర్‌ ఐడీతో పాటు పేరు, ఇతరత్రా వివరాలను ఎంటర్‌ చేయడం ద్వారా కూడా ఓటర్‌ స్లిప డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
మొబైల్‌ యాప్‌లో క్యూఆర్‌ కోడ్‌ ద్వారా కూడా ఓటర్‌ స్లిప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మీ ఓటర్‌ ఐడీ పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా ఓటర్‌ స్లిప్‌ను సులభంగా పొందవచ్చు. అలా వచ్చిన సమాచారాన్ని వాట్సాప్‌, మెయిల్‌ ద్వారా కూడా షేర్‌ చేసుకోవచ్చు.

మెసేజ్‌ ద్వారా కూడా..

మెసేజ్‌ రూపంలో ఓటర్‌ స్లిప్‌ పొందడానికి ECI అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి.. ఓటర్‌ ఐడీ టైప్‌ చేసి 1950 నంబర్‌కు మెసేజ్‌ పంపించాలి. కాసేపటికే మీ పార్ట్‌ నంబర్‌, సీరియల్‌ నంబర్‌ వంటి సమాచారం మొబైల్‌కు మెసేజ్‌ రూపంలో వస్తుంది.

తాజా వార్తలు

2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా  2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా
యూఎస్‌ఏ, వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు విజయాన్ని అందించిన తర్వాత ఇటీవలే టీ20ల నుంచి రిటైరయిన రోహిత్ శర్మ వచ్చే ఏడాది జరగబోయే రెండు ముఖ్యమైన...
నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలు, ముగింపు ఫ్లాట్; మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్, FMCG పతనం
శ్రీలంక LPG కంపెనీ మరియు టెర్మినల్ కోసం ఎనిమిది మంది బిడ్డర్లలో భారత్ పెట్రోలియం
భారతదేశంలో కొత్త కొడియాక్, ఆక్టేవియాను పరిచయం చేయడానికి స్కోడా సిద్ధమైంది
IRFC, RVNL మరియు IRCTC వంటి రైల్వే స్టాక్‌లు నేడు ఎందుకు లాభపడుతున్నాయి??
ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వీపీ హేమంత లాంబా రాజీనామా
'మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తాం': వినియోగదారులు గ్లిచ్ తర్వాత జెరోధాను