ఆ ఒక్క రోజు దర్శన సమయం మార్పు

తిరుమల శ్రీవారిని అనుసరించే వారికి ముఖ్యమైన సమాచారం. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జూలై 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.జూలై 16న ఆణివార ఆస్థానం రోజున కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆలయంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి సంవత్సరం నాలుగు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాలు నిర్వహించడం ఆనవాయితీ. ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, ఉగాది పండుగలకు ముందు వచ్చే మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా ఉదయం ఆరు గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం దాదాపు ఐదు గంటల పాటు కొనసాగనుంది. స్వామివారి మూలవిరాట్టుకు పూజాది కార్యక్రమాలు తిరుమంజనం ఆచారాన్ని అనుసరించి ఆలయ అర్చకులు నిర్వహించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి భక్తులు స్వామివారి దర్శనం పొందగలుగుతారు. తిరుమంజనం కారణంగా మంగళవారం అష్టదళపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ సదస్సులో టీటీడీ ఉద్యోగులు, అధికారులు పాల్గొంటారు. 

About The Author: న్యూస్ డెస్క్