సొంత ఊళ్ళకు తరలుతున్న ఓటర్లు

భారీగా టికెట్ రేట్లు పెంచేసిన ప్రైవేటు ట్రావెల్స్

సొంత ఊళ్ళకు తరలుతున్న ఓటర్లు

ఈనెల 13న ఏపీలో ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ముఖ్య ప్రాంతాల నుంచి ఏపీ వైపు ఈ వారం భారీగా ప్రయాణాలు చేస్తున్నారు.. ఈ రద్దీని ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. అడ్డగోలుగా ఛార్జీలు పెంచేస్తున్నారు.హైదరాబాద్-విశాఖపట్నం ప్రైవేటు స్లీపర్ బస్సు టికెట్ ధర ప్రస్తుతం రూ.4వేలు పలుకుతుందని వాపోతున్నారు.
సోమవారం ఎన్నికలు ఉండడంతో చాలా మంది రెండు మూడు రోజుల ముందే వెళ్లాలని భావిస్తున్నారు. హైదరాబాద్ లోని చాలామంది ఉద్యోగులు శుక్ర, శనివారాల్లో ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఇరు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు పదుల సంఖ్యలో ప్రత్యేక బస్సులు పెట్టినా అన్నింట్లోనూ సీట్లు నిండుకున్నాయి. ఏపీ, సూపర్ గ్జరీ, ఆల్ట్రా డీలక్స్ బస్సులు ఎన్ని వేసినా నిండిపోతున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇంకా అదనంగా నడిపేందుకు బస్సులు లేకపోవడంతో ఏపీ.ఎస్.ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ లనూ సిద్ధం చేస్తోంది. అలాగే బెంగళూరు నుంచి విజయవాడకు 10వ తేదీన ప్రత్యేక బస్సులతో కలిపి 21 సర్వీసులు ఏర్పాటు చేయగా.. ఒక్క సీటూ కూడా మిగల్లేదని వాపోతున్నారు. 11వ తేదీన 16 బస్సులు ఉండగా అవి కూడా నిండిపోవడంతో మరో ప్రత్యేక సర్వీసును ఆన్ లైన్ లో అందుబాటులో పెట్టినట్లు అధికారులు పేర్కొంటున్నారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు బస్సు ప్రయాణం 12 గంటలకు పైగా పడుతుండటంతో ఏపీ స్లీపర్ బస్సులకు డిమాండు ఏర్పడింది. దీంతో ప్రైవేటు ఆపరేటర్లు వెనుక సీటు, ముందు సీటు, కింది బెర్తూ అంటూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. కొన్ని బస్సుల్లో లోయర్ బెర్తుకు రూ.4,566లుగా నిర్ణయించారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈసీజన్ లో ఎప్పుడూ లేనంతగా ప్రైవేట్ బస్సుల టికెట్ ధరలు పెంచేశారని ఆరోపిస్తున్నారు. ఈ అడ్డగోలు దోపిడీ బహిరంగంగా.. వెబ్ సైట్ల ద్వారానే కొనసాగుతుంది. ఇంత జరుఉతున్నా..రవాణాశాఖ అదికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజా వార్తలు

2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా  2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా
యూఎస్‌ఏ, వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు విజయాన్ని అందించిన తర్వాత ఇటీవలే టీ20ల నుంచి రిటైరయిన రోహిత్ శర్మ వచ్చే ఏడాది జరగబోయే రెండు ముఖ్యమైన...
నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలు, ముగింపు ఫ్లాట్; మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్, FMCG పతనం
శ్రీలంక LPG కంపెనీ మరియు టెర్మినల్ కోసం ఎనిమిది మంది బిడ్డర్లలో భారత్ పెట్రోలియం
భారతదేశంలో కొత్త కొడియాక్, ఆక్టేవియాను పరిచయం చేయడానికి స్కోడా సిద్ధమైంది
IRFC, RVNL మరియు IRCTC వంటి రైల్వే స్టాక్‌లు నేడు ఎందుకు లాభపడుతున్నాయి??
ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వీపీ హేమంత లాంబా రాజీనామా
'మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తాం': వినియోగదారులు గ్లిచ్ తర్వాత జెరోధాను