ఈ ఏడాది కొత్తగా 300 శాఖలు

ప్రభుత్వరంగ సంస్థ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను ఏడాది ప్రాతిపదికన కన్సాలిడేటెడ్‌ నికర లాభం 18.36 శాతం వృద్ధితో రూ.3,328 కోట్లు ఆర్జించింది.

  • యూనియన్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈవో ఏ మణిమెఖలై
  • ప్రభుత్వరంగ సంస్థ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను ఏడాది ప్రాతిపదికన కన్సాలిడేటెడ్‌ నికర లాభం 18.36 శాతం వృద్ధితో రూ.3,328 కోట్లు ఆర్జించింది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి నిధుల కేటాయింపు తగ్గుముఖం పట్టడం వల్లనే లాభాల్లో వృద్ధి నమోదైందని బ్యాంక్‌ ఎండీ, సీఈవో ఏ మణిమెఖలై తెలిపారు. నికర వడ్డీ ఆదాయం 14 శాతం ఎగబాకి రూ.9,437 కోట్లకు చేరింది.
  • గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.13,797 కోట్ల కన్సాలిడేటెడ్‌ లాభాన్ని గడించింది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్‌ రూ.3,222 కోట్ల నిధులు వెచ్చించింది. అలాగే కొత్తగా రూ.3,202 కోట్ల రుణాలు మొండి బకాయిల జాబితాలోకి చేరాయని ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా ఆమె చెప్పారు. వ్యాపార విస్తరణలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 250 శాఖల నుంచి 300 శాఖల వరకు దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు ఆమె ప్రకటించారు.

About The Author: న్యూస్ డెస్క్