ఆ కారు 2.8 సెకన్లలో 100 కిమీ స్పీడ్.. సొంతం చేసుకున్న రేమండ్స్ సీఎండీ..!

ఆ కారు 2.8 సెకన్లలో 100 కిమీ స్పీడ్.. సొంతం చేసుకున్న రేమండ్స్ సీఎండీ..!

Gautam Singhania | రేమండ్స్ గ్రూప్ చైర్మన్ గౌతం సింఘానియా తాజాగా మరో సూపర్ కారు ‘మెక్ లారెన్స్ 750ఎస్’ను సొంతం చేసుకున్నారు.

ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ ‘రేమండ్స్’ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతం సింఘానియా పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటికే పలు ఖరీదైన కార్లను సొంతం చేసుకున్న గౌతం సింఘానియా.. తాజాగా మరో సూపర్ కారును సొంతం చేసుకున్నారు. మెక్ లారెన్ కంపెనీ 750ఎస్ మోడల్ కారును గౌతం సింఘానియా కొనుగలు చేశారు. దీని ధర రూ.5.91 కోట్లు ఉంటుంది. ఇప్పటికే ఆయన గ్యారేజీలో రెండు మెక్ లారెన్ కార్లు (మెక్ లారెన్720ఎస్, మెక్ లారెన్ 570ఎస్) ఉన్నాయని చెబుతున్నారు.

 
తాజాగా గౌతం సింఘానియా కొనుగోలు చేసిన మెక్ లారెన్ 750ఎస్ కారు ఆరెంజ్ అండ్ బ్లాక్ డ్యుయల్ టోన్ షేడ్‌లో ఉంటుంది. మెక్ లారెన్ 720ఎస్ కంటే మెక్ లారెన్ 750ఎస్ మోడల్ కారు మెరుగా ఉంటుంది. 4.0 లీటర్ల ట్విన్ టర్బో ఇంజిన్‌తో వస్తుందీ కారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 750 హెచ్పీ విద్యుత్, 800 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. కేవలం 2.8 సెకన్లలోనే 100 కి.మీ వేగాన్ని అందుకోవడం దీని స్పెషాలిటీ. ఇక 4.4 సెకన్లలో 200 కి.మీ వేగంతో దూసుకెళ్తుందీ కారు. 720ఎస్ మోడల్ కారు కంటే 10 శాతం వేగంగా దూసుకెళ్తుంది.
 

తాజా వార్తలు

Airtel Digital TV అమెజాన్ ప్రైమ్‌తో సహకరిస్తుంది Airtel Digital TV అమెజాన్ ప్రైమ్‌తో సహకరిస్తుంది
ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ తన కొత్త అల్టిమేట్ మరియు అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్‌ను ప్రారంభించేందుకు అమెజాన్ ప్రైమ్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ఉత్తమమైన లైవ్...
US ఫెడ్ రేటు నిర్ణయం కంటే ముందే సెన్సెక్స్, నిఫ్టీ పెరుగుదల; ఓలా ఎలక్ట్రిక్ షేర్లు దూసుకుపోయాయి
స్మృతి ఇరానీ ప్రపంచ బ్యాంకు నేతలతో లింగ సమానత్వం గురించి చర్చించారు
అమెరికన్ జిమ్నాస్ట్ జోర్డాన్ చిలెస్ స్విస్ సుప్రీంకోర్టుకు ఒలింపిక్ కాంస్యాన్ని పునరుద్ధరించడానికి బిడ్ తీసుకున్నాడు
డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ 1-0తో చైనాను ఓడించి ఐదో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్‌ను గెలుచుకుంది.
టెస్టు సిరీస్‌లో భారత్‌ను ఓడించగలమని బంగ్లాదేశ్ నమ్ముతోంది: షోరిఫుల్ ఇస్లాం
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ నెలాఖరు నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయనుంది