నష్టాలు నుంచి లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ప్రారంభ నష్టాల నుంచి కోలుకుని లాభాల్లో ముగిశాయి. ఆటోమొబైల్ మరియు ఆటో, మెటల్ స్టాక్స్ కంపెనీల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగినా, దేశీయ మదుపర్లు స్థిరంగా కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇచ్చారు.బీఎస్‌ఈ సెన్సెక్స్ 253 పాయింట్ల లాభంతో 73.917 వద్ద, నిఫ్టీ ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్ 62 పాయింట్లు లాభపడి 22.466 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్ఈ ఇండెక్స్‌లో సెన్సెక్స్, మహీంద్రా అండ్ మహీంద్రా 6 శాతం లాభపడగా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్,  ,కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, మారుతీ సుజుకీ స్టాక్స్ ప్రధానంగా లాభాల్లో ముగిశాయి టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, నెస్లే, విప్రోలు నష్టాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నేతృత్వంలో ఐటీ స్టాక్స్ పతనం కావడంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.85% పడిపోయింది. కాగా, నిఫ్టీ ఆటో ఇండెక్స్ 1.7 శాతం పెరిగి ఆల్ టైమ్ గరిష్టానికి పెరిగింది. మహీంద్రా, బాలక్రుష్ణ ఇండస్ట్రీస్, టీవీ మోటార్రంగాలు మెరుగుపడ్డాయి.కాగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.65 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.9 శాతం లాభాలతో ముగిశాయి.

About The Author: న్యూస్ డెస్క్