జూలై 22న పార్లమెంటులో కేంద్ర యూనియన్ బడ్జెట్...?!

వచ్చే నెల 22న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) పూర్తిస్థాయి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక సర్వేను జూలై 3న విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

కేంద్ర ఆర్థిక మంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ తయారీపై కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. జాగ్రత్తగా, సమగ్రంగా విశ్లేషించి బడ్జెట్‌ను రూపొందించాలని ఆమె చెప్పిన సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రాధాన్యతలపై దృష్టి సారించేలా బడ్జెట్‌ను రూపొందించాలని నిర్మలా సీతారామన్‌ చెప్పినట్లు సమాచారం. కాగా, జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈ నెల 22న జరగనుంది. గతేడాది అక్టోబర్ తర్వాత జీఎస్టీ సమావేశం జరగడం ఇదే తొలిసారి.

About The Author: న్యూస్ డెస్క్