కార్తీతో హెచ్‌ వినోద్ కాంబో రిపీట్‌

కోలీవుడ్‌లోని అత్యంత ప్రతిభావంతులైన దర్శకుల్లో హెచ్.వినోత్ ఒకరు. స్టార్ యాక్టర్ కార్తీ నటించిన ఖాకీ సినిమా బాక్సాఫీస్  సూపర్ హిట్ గా నిలిచింది.వలిమై , 'తునీవు' చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేసిన ఈ దర్శకుడు ఇప్పటికే 'విజయ్'తో 'దళపతి 69' చిత్రంలో ప్రకటించాడుతాజాగా హెచ్‌ వినోద్ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన వార్త నెట్టింట రౌండప్ చేస్తోంది. ఖాకీ 2కు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడన్న వార్త ఇప్పుడు అభిమానుల్లో జోష్‌ నింపుతోంది. దళపతి 69 షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వెళ్లనుందట. లేటెస్ట్ సమాచారం ప్రకారం మిడ్‌ 2026లో సీక్వెల్‌ షూటింగ్ మొదలు కానుంది. ఇదే నిజమైతే కార్తీ-వినోద్‌ కాంపౌండ్ నుంచి మరో బ్లాక్‌ బస్టర్ సినిమా రావడం పక్కా అయిపోయినట్టేనంటున్నాడు ట్రేడ్‌ పండితులు, మూవీ లవర్స్‌.

నివేదికల ప్రకారం, పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహించనున్న 'సర్దార్ 2'కి సీక్వెల్ అయిన 'సర్దార్ 2' షూటింగ్‌లో కార్తీ త్వరలో జాయిన్ అవుతాడు. సర్దార్ 2 కంబోడియా మిషన్ నేపథ్యంలో ఉంటుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. స‌ర్దార్ 2 షూటింగ్ చెన్నై, క‌జ‌కిస్తాన్, అజ‌ర్‌బైజాన్, జార్జియాల్లో కొన‌సాగుతుంద‌ని స‌మాచారం.

ఈ సినిమాలో అమిగోస్ స్టార్ అసికా రంగనాథ్ కీలక పాత్రలో నటిస్తుంది. యువన్ శంకర్ రాజా సంగీతం, నేపథ్య సంగీతం అందిస్తున్నారు. మరోవైపు కార్తీ నలన్ కుమారస్వామి దర్శకత్వంలో వా వథియారే చిత్రంలో నటిస్తున్నారు.

 

About The Author: న్యూస్ డెస్క్