పదవ తరగతి మాదిగ విద్యార్థుల అభినందన సభ - 2024.

నేటి పౌరుషం : గుంటూరు: 2024వ సంవత్సరం 10వ తరగతి లో టాప్ మార్కులు సాధించిన మన మాదిగ విద్యార్థులను అభినందించే కార్యక్రమం.

మాదిగ జాతి  రక్తసంబంధీకులారా

స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరం నడుస్తుంది. ఈ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో   అన్ని సామాజిక వర్గాలు వారి వారి విద్యార్థుల్ని వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి అభినందించే కార్యక్రమాలు ఎప్పటినుండో చేస్తూ ఉన్నాయి. మనం అభివృద్ధి చెందాలంటే సమాచారం చాలా ప్రాముఖ్యమైంది. ఆ సమాచారమే విద్యా ఉద్యోగ ఉపాధి (EEE)
రంగాల్లో నుంచి అందిస్తే అభివృద్ధిలో ముందుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి.

 ఆవు చేసింది 2021లో చిలకలూరిపేటలో ప్రారంభించబడినటువంటి EEE మన విద్యార్థులకి  విద్య ఉద్యోగం ఉపాధికి సంబంధించిన సమాచారం రోజు అందించడంతోపాటు కెరీర్ గార్డెన్స్ ప్రోగ్రాములు , తల్లిదండ్రులకు విద్యా అవగాహన సదస్సులు, ఆయా గ్రామాల్లో గ్రామస్థాయిలో స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థులను గుర్తించి వారిని అభినందించడం జరిగింది.

 2023వ సంవత్సరం నుండి 10వ తరగతి మాది విద్యార్థుల్లో రాష్ట్రస్థాయిలో టాప్ మార్కులు సాధించినటువంటి వారిని గుర్తించడంలో భాగంగా

 రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి ₹50,000 

 రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి ₹30,000 

 రాష్ట్రస్థాయి తృతీయ బహుమతి ₹.20000 

మరియు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉమ్మడి జిల్లాలో 
 టాప్ మార్కుల సాధించిన మన విద్యార్థులకు ప్రతి జిల్లాకు 
 ₹ 10,000 చొప్పున 13 జిల్లాలకు అందించడం జరిగింది 

 

 గుంటూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ( ఠాగూర్ మెమోరియల్ హాల్) నందు ఈ కార్యక్రమం 2023లో  అత్యద్భుతంగా, ఘనంగా, ఆత్మవిశ్వాసం తో నిర్వహించడం జరిగింది.


 తిరిగి 2024 సంవత్సరలో కూడా  పదవ తరగతిలో రాష్ట్ర మరియు జిల్లాస్థాయిలో టాప్ మార్కులు సాధించిన మాదిగ విద్యార్థుల అభినందించడానికి ఆత్మగౌరవంతో మన పిల్లల బ్రతకడం కోసం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము.

About The Author: న్యూస్ డెస్క్