ఖలీస్థానీ నిజ్జర్ హత్య కేసు.. మరో భారతీయుడ్ని అరెస్ట్ చేసిన కెనడా

ఖలీస్థానీ నిజ్జర్ హత్య కేసు.. మరో భారతీయుడ్ని అరెస్ట్ చేసిన కెనడా

ఖలీస్థానీ వేర్పాటువాది హ‌ర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు భారత్, కెనడాల మధ్య దౌత్య యుద్ధానికి ఆజ్యం పోసింది. ఈ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రదాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్‌లో చేసిన ప్రకటన కలకలం రేపింది. అయితే, ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆధారాలు ఉంటే ఇవ్వాలని భారత్ కోరింది. ఈ క్రమంలో అనుమానితులుగా భావించిన ముగ్గురు భార‌తీయులను గతవారం అదుపులోకి తీసుకున్నారు.

ఖలీస్థాన్ వేర్పాటువాది హరదీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో మరో అనుమానితుడ్ని కెనడా పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు భారతీయులను కెనడా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, సర్రేలోని బ్రాంప్టన్‌‌‌లో భారతీయ యువకుడు అమరదీప్ సింగ్ (22)ను అరెస్ట్ చేసినట్టు కెనడా అధికారులు వెల్లడించారు. అతడిపై హత్య సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్టు తెలిపారు. నిజ్జర్ హత్య కేసులో పాత్రధారి అయిన అమరదీప్‌ సింగ్‌ను మే 11న అరెస్ట్ చేసినట్టు ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (IHIT) పేర్కొంది. ఇప్పటికే అక్రమ ఆయుధాల కేసులో పీల్ రీజినల్ పోలీసులు కస్టడీలో ఉన్నాడని చెప్పింది.

"హరదీప్ సింగ్ నిజ్జర్ హత్యలో కేసులో నిందితులను పట్టుకోడానికి కొనసాగుతున్న మా దర్యాప్తును స్వభావాన్ని ఈ అరెస్ట్ నిర్దారిస్తుంది’ అని ఒట్టావా ఎస్పీ మణిదీప్ మూకర్ అన్నారు. నిందితులపై ఫస్ట్‌ డిగ్రీ హత్య కేసు అభియోగాలు మోపినట్లు కెనడా అధికారులు వెల్లడించారు. గతేడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రె గురునానక్ సిక్కు గురుద్వారా వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కాల్పుల్లో నిజ్జర్ చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు భారతీయులు కరన్ బ్రార్ (22), కమల్‌ప్రీత్ సింగ్ (22), కరణ్‌ప్రీత్ సింగ్ (22)లను మే 3న అరెస్ట్ చేశారు. ఎడ్మంటన్‌ ప్రాంతంలో నివాసముంటున్న నిందితులకు పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో లింకులున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

భారత్ నేరస్థులుగా గుర్తించిన పలువురు గ్యాంగ్‌స్టర్లు కెనడాలో ఉంటూ దేశ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఖలిస్థానీ వేర్పాటువాదాన్ని ఎగదోసేందుకు ఐఎస్‌ఐ నిరంతరం నిధులు అందజేస్తోంది. దీనిపై భారత్ ఎంతగా చెబుతున్నా కెనడా మాత్రం చెవికెక్కించుకోవడం లేదు. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఆ దేశానికి ఆధారాలు అందజేసినా చర్యలు తీసుకోవడం లేదు. ఇక, నిజ్జర్ హత్య కేసులో భారతీయ ఏజెంట్ల పాత్రపై తమకు విశ్వసనీయ సమాచారం ఉందంటూ గతేడాది కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

ఉగ్రవాదం సమస్య సహా పలు ప్రధాన అంశాల్లో ఢిల్లీ ప్రయోజనాల కోసం కెనడా నేతలను ప్రభావితం చేసేందుకు కొందరు భారత అధికారులు, స్థానిక ప్రతినిధులు పలు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారని ఇటీవల ఓ దర్యాప్తు నివేదిక పేర్కొంది. అయితే, ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. కెనడాలోని అంతర్గత రాజకీయాల కారణంగా తలెత్తే సమస్యలని, తమకు ఎలాంటి సంబంథం లేదని భారత్ స్పష్టం చేసింది.

తాజా వార్తలు

Airtel Digital TV అమెజాన్ ప్రైమ్‌తో సహకరిస్తుంది Airtel Digital TV అమెజాన్ ప్రైమ్‌తో సహకరిస్తుంది
ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ తన కొత్త అల్టిమేట్ మరియు అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్‌ను ప్రారంభించేందుకు అమెజాన్ ప్రైమ్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ఉత్తమమైన లైవ్...
US ఫెడ్ రేటు నిర్ణయం కంటే ముందే సెన్సెక్స్, నిఫ్టీ పెరుగుదల; ఓలా ఎలక్ట్రిక్ షేర్లు దూసుకుపోయాయి
స్మృతి ఇరానీ ప్రపంచ బ్యాంకు నేతలతో లింగ సమానత్వం గురించి చర్చించారు
అమెరికన్ జిమ్నాస్ట్ జోర్డాన్ చిలెస్ స్విస్ సుప్రీంకోర్టుకు ఒలింపిక్ కాంస్యాన్ని పునరుద్ధరించడానికి బిడ్ తీసుకున్నాడు
డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ 1-0తో చైనాను ఓడించి ఐదో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్‌ను గెలుచుకుంది.
టెస్టు సిరీస్‌లో భారత్‌ను ఓడించగలమని బంగ్లాదేశ్ నమ్ముతోంది: షోరిఫుల్ ఇస్లాం
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ నెలాఖరు నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయనుంది