ఆస్ట్రేలియన్ వీసా నిబంధనలు కఠినం ఆ దేశ ప్రభుత్వం ప్రకటన

స్టూడెంట్ వీసాపై అంతర్జాతీయ విద్యార్థులు నిరవధికంగా ఆస్ట్రేలియాలో ఉండకుండా ప్రభుత్వం కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టింది. ఫలితంగా, తాత్కాలిక వీసా హోల్డర్లు ఇకపై ఆస్ట్రేలియాలో ఉండి స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోలేరు.ఈ నెల 1 తేదీ నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. దేశ ఆర్థికాభివృద్ధికి సహకరించే వారికే వీసాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెల 1వ తేదీ నుండి ఆస్ట్రేలియాలో ఉన్న తాత్కాలిక గ్రాడ్యుయేట్, విజిటర్ మారిటైమ్‌ క్రూ వీసాలు వంటి తాత్కాలిక వీసాలను కలిగి ఉన్నవారు విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేయలేరు. ఇది ఇప్పటికే ఆస్ట్రేలియాలో ఉన్న వేలాది మంది భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపుతుంది.ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే పర్యాటక వీసా దరఖాస్తుదారులు తప్పనిసరిగా వెలుపలి  నుండి దరఖాస్తు చేసుకోవాలి. తాత్కాలిక వీసాలపై అంతర్జాతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో నిరవధికంగా ఉండిపోవడాన్ని  నిరోధించేందుకు ఆ దేశం ఈ చర్య తీసుకుంది.గతేడాది డిసెంబర్ 11న ప్రకటించిన నూతన మైగ్రేషన్‌ వ్యూహంలో   భాగంగా ఈ మార్పులు చేశారు.

About The Author: న్యూస్ డెస్క్