అమెరికాలో నితీ శా కందుల మిస్సింగ్‌

హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థిని అమెరికాలోని కాలిఫోర్నియాలో అదృశ్యమయ్యారు. . 23 ఏళ్ల నితీ శా   కందుల గత నెల 28వ తేదీ నుంచి కనిపించడం లేదని స్థానిక పోలీసులు తెలిపారు. దీంతో మీ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు.నితీశా కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో చదువుతోంది. శాన్ బెర్నార్డినో పోలీసుల కథనం ప్రకారం,ఆమె  చివరిసారిగా  లాస్‌ ఏంజెల్స్‌లో కాలిపోర్నియా నంబర్‌ ప్లేట్‌తో ఉన్న టయోటా కారును గత నెల 30న నడుపుతూ కనిపించిందని కొంత మంది చెప్పినట్టు శాన్‌ బెర్నార్డినో పోలీసులు వెల్లడించారు. పోలీసులు నితీశా కందుల ఆచూకీ ప్రయత్నిస్తున్నారు.

About The Author: న్యూస్ డెస్క్