తైవాన్‌ నూతన అధ్యక్షుడిగా లై

తైవాన్ కొత్త అధ్యక్షుడిగా 64 ఏళ్ల లై చింగ్-డే సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా తైవాన్ వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్న త్సాయ్ ఇంగ్-వెన్ తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టారు. సెంట్రల్ తైపీలో జపాన్ వలసరాజ్యాల కాలంలో నిర్మించిన అధ్యక్ష భవనంలో లై ప్రమాణ స్వీకారం చేశారు. తైవాన్‌ను ఆక్రమించే చైనా ప్రయత్నాన్ని అడ్డుకోవడం దాని అతిపెద్ద సవాళ్లలో ఒకటి.అయితే, తైవాన్ అధ్యక్షుడిగా తన మొదటి ప్రసంగంలో, లై చైనా పట్ల సుహృద్భావాన్ని వ్యక్తం చేశారు. చైనాతో శాంతిని కోరుకుంటున్నట్లు చెప్పారు. స్వయంప్రతిపత్తిని కోరుతున్న తైవాన్‌పై చైనా సైనిక బెదిరింపులను ఆపాలని ఆయన పిలుపునిచ్చారు. తైవాన్ జలసంధికి ఇరువైపులా శాంతి నెలకొనాలని పిలుపునిచ్చారు.

About The Author: న్యూస్ డెస్క్