ఇరాన్‌లో భారీ భూకంపం రిక్టరు స్కేలుపై 4.9గా నమోదు

| ఇరాన్‌లో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం 1:24 గంటలకు ఈశాన్య కష్మార్ నగరంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.9గా నమోదైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. భూకంపం కారణంగా  నలుగురు మరణించినట్లు సమాచారం. దాదాపు 120 మంది గాయపడ్డారని ప్రభుత్వ మీడియా పేర్కొంది.యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉంది. భూకంపం ధాటికి భారీ భవనం ధ్వంసమైంది. అనేక భవనాలు దెబ్బతిన్నాయని కష్మార్‌  గవర్నర్ హోజతుల్లా షరియత్మదారి నివేదించారు. రోడ్లు కూడా ధ్వంసమయ్యాయని అంటున్నారు. ప్రభావిత ప్రాంతాల వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లినట్లు తెలిసింది.ఇరాన్ వివిధ టెక్టోనిక్ ప్లేట్లపై ఉంది కాబట్టి, ఇక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. గత సంవత్సరం ప్రారంభంలో, టర్కీ సరిహద్దుకు సమీపంలో వాయువ్య ఇరాన్ పర్వతాలలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 800 మందికి పైగా గాయపడ్డారు. 2003లో ఇరాన్‌లో కూడా అత్యంత బలమైన భూకంపం సంభవించింది. ఆగ్నేయ ఇరాన్‌లోని బామ్‌లో 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపం 31,000 మందికి పైగా మరణించింది.

About The Author: న్యూస్ డెస్క్