కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌లపై ఒక్కో లీటర్ మీద రూ.3 పెంచుతూ నిర్ణయం

కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక ప్రజలను షాక్ కు గురి చేసింది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సిద్ధరామయ్య ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించారు. లీటరుకు 3 చొప్పున పెంచారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, కర్ణాటక పెట్రోల్‌పై సేల్స్ ట్యాక్స్  (కెఎస్‌టి) 25.92% నుండి 29.84%కి మరియు డీజిల్‌పై 14.3% నుండి 18.4%కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకారం, పెట్రోల్ వినియోగం లీటర్ పెట్రోల్‌పై రూ.3, లీటర్ డీజిల్‌పై రూ.3.02 పెరిగింది. దీంతో బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.102.86కి, డీజిల్ ధర రూ.88.94కి చేరింది.పన్ను వ్యవహారాల జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుండి ప్రకటన ప్రకారం, ధర పెరుగుదల తక్షణమే అమలులోకి వస్తుంది. ఈ ధరల పెంపు వల్ల ఏడాదికి రూ.2,500 నుంచి 2,800 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరుతుంది.

About The Author: న్యూస్ డెస్క్