ఓటు వేసేందుకు వెళ్తున్న ఒక వ్యక్తిపై ఏనుగు దాడి..వ్యక్తి మృతి

 ఓటు వేసేందుకు వెళ్తున్న ఒక వ్యక్తిపై ఏనుగు దాడి..వ్యక్తి మృతి

పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న ఓ వ్యక్తిపై ఏనుగు దాడి చేసింది.  అతన్ని తొక్కి చంపేసింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలో చోటుచేసుకుంది.

 గోబర్బాని  గ్రామానికి చెందిన ఈ 71 ఏళ్ల వ్యక్తి ఉదయం 6:30 గంటలకు ఓటు వేయడానికి తన ఇంటి నుండి బయలుదేరాడు. శనివారము రోజున. ధోలబెడ  అటవీ మార్గంలో పోలింగ్ స్టేషన్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా ఏనుగు దాడి చేసింది. వృద్ధుడిని తొక్కి  చంపింది.

ఇంతలో విషయం తెలుసుకున్న గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు మృతుడు 71 ఏళ్ల సురేంద్ర నాథ్‌గా గుర్తించారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అంత్యక్రియలకు తక్షణ సహాయంగా, అటవీ శాఖ రూ. 25,000 విరాళంగా అందించిందని కుమారుడు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

తాజా వార్తలు

Airtel Digital TV అమెజాన్ ప్రైమ్‌తో సహకరిస్తుంది Airtel Digital TV అమెజాన్ ప్రైమ్‌తో సహకరిస్తుంది
ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ తన కొత్త అల్టిమేట్ మరియు అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్‌ను ప్రారంభించేందుకు అమెజాన్ ప్రైమ్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ఉత్తమమైన లైవ్...
US ఫెడ్ రేటు నిర్ణయం కంటే ముందే సెన్సెక్స్, నిఫ్టీ పెరుగుదల; ఓలా ఎలక్ట్రిక్ షేర్లు దూసుకుపోయాయి
స్మృతి ఇరానీ ప్రపంచ బ్యాంకు నేతలతో లింగ సమానత్వం గురించి చర్చించారు
అమెరికన్ జిమ్నాస్ట్ జోర్డాన్ చిలెస్ స్విస్ సుప్రీంకోర్టుకు ఒలింపిక్ కాంస్యాన్ని పునరుద్ధరించడానికి బిడ్ తీసుకున్నాడు
డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ 1-0తో చైనాను ఓడించి ఐదో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్‌ను గెలుచుకుంది.
టెస్టు సిరీస్‌లో భారత్‌ను ఓడించగలమని బంగ్లాదేశ్ నమ్ముతోంది: షోరిఫుల్ ఇస్లాం
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ నెలాఖరు నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయనుంది