సెకన్ల వ్యవధిలో ముంచెత్తిన కుర్తాళం జలపాతం

సెకన్ల వ్యవధిలో ముంచెత్తిన కుర్తాళం జలపాతం

  • తమిళనాడులోని తేన్ కాశి జిల్లాలో కొన్ని రోజులుగా వర్షాలు
  • కళ్లెదుటే ఉద్ధృతమైన నీటి ప్రవాహం
  • ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసిన పర్యాటకులు
  • వైరల్ అవుతున్న వీడియో 

కుర్తాళం... తమిళనాడులోని తేన్ కాశీ జిల్లాలో పశ్చిమ కనుమలలో ఒక పుణ్యక్షేత్రం. ఇక్కడి జలపాతం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణ. అయితే ఈ ప్రాంతంలో గత ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఎప్పటిలాగే, పురాతన కుర్తాళం జలపాతాల వద్దకు పర్యాటకులు వచ్చినప్పుడు, కొన్ని సెకన్లలో ఆకస్మిక వరదలు సంభవించాయి. చూస్తుండగానే నీటి ప్రవాహం పెరిగింది. దీంతో పర్యాటకులు షాక్‌కు గురయ్యారు. ఒకరి చేతులు ఒకరు పట్టుకుని పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

కాగా, కుర్తాళం భయానక రూపుదాల్చిన నేపథ్యంలోఅశ్విన్ అనే 17 ఏళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. 11వ తరగతి చదువుతున్న బాలుడు పాళయంకోట్టై జిల్లాలోని ఎన్జీవో కాలనీకి చెందినవాడు.

జిల్లా కలెక్టర్ ఎస్పీ వెంటనే స్పందించి కుర్తాళం జలపాతం వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే జలపాతానికి అర కిలోమీటరు దూరంలో రాళ్ల మధ్య అశ్విన్ మృతదేహం కనిపించింది.

తాజా వార్తలు

Airtel Digital TV అమెజాన్ ప్రైమ్‌తో సహకరిస్తుంది Airtel Digital TV అమెజాన్ ప్రైమ్‌తో సహకరిస్తుంది
ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ తన కొత్త అల్టిమేట్ మరియు అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్‌ను ప్రారంభించేందుకు అమెజాన్ ప్రైమ్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ఉత్తమమైన లైవ్...
US ఫెడ్ రేటు నిర్ణయం కంటే ముందే సెన్సెక్స్, నిఫ్టీ పెరుగుదల; ఓలా ఎలక్ట్రిక్ షేర్లు దూసుకుపోయాయి
స్మృతి ఇరానీ ప్రపంచ బ్యాంకు నేతలతో లింగ సమానత్వం గురించి చర్చించారు
అమెరికన్ జిమ్నాస్ట్ జోర్డాన్ చిలెస్ స్విస్ సుప్రీంకోర్టుకు ఒలింపిక్ కాంస్యాన్ని పునరుద్ధరించడానికి బిడ్ తీసుకున్నాడు
డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ 1-0తో చైనాను ఓడించి ఐదో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్‌ను గెలుచుకుంది.
టెస్టు సిరీస్‌లో భారత్‌ను ఓడించగలమని బంగ్లాదేశ్ నమ్ముతోంది: షోరిఫుల్ ఇస్లాం
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ నెలాఖరు నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయనుంది