దేశ రాజధాని ఢిల్లీలో ఎండ దెబ్బకు ఏడుగురు మృతి, 12 మంది పరిస్థితి విషమం

రాజధాని ఢిల్లీఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్‌కు మించి నమోదైంది. వేడిగాలుల కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు.  ఇందుకు కారణం. వడదెబ్బతో ఏడుగురు చనిపోయారు. 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఎండలు విపరీతంగా ఉండడంతో ఢిల్లీలోని ప్రజలు ఆసుపత్రి  పాలవుతున్నారు.మే 27 నుంచి దాదాపు 45 మంది రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరారు

.గత రెండు రోజుల్లో 22 మంది వడదెబ్బతో ఆసుపత్రిలో చేరగా, ఏడుగురు మరణించారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డి.అజయ్ శుక్లా తెలిపారు. 12 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అంచనా. కూలి పనులు చేసుకునే వారు వడదెబ్బకు గురై ఆసుపత్రుల పాలవుతున్నట్లు గుర్తించారు. వడదెబ్బతో బాధపడుతున్న రోగులను ఆలస్యంగా ఆసుపత్రిలో చేర్చడం కూడా అధిక మరణాల రేటుకు దోహదం చేస్తుందని ఆయన చెప్పారు.

About The Author: న్యూస్ డెస్క్