పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో అల్లకల్లోలం.. ప్రభుత్వంపై తిరగబడిన ప్రజలపైకి కాల్పులు

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో అల్లకల్లోలం.. ప్రభుత్వంపై తిరగబడిన ప్రజలపైకి కాల్పులు

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రస్తుతం అల్లకల్లోలం కొనసాగుతోంది. ప్రజలు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రభుత్వానికి ఎదురుతిరిగిన ప్రజలపైకి పోలీసులు బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో ఇద్దరు పౌరులు దుర్మరణం చెందగా.. చాలా మంది గాయపడ్డారు. స్థానిక ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న పాలనపై విరక్తి చెందిన అక్కడి జనం.. ప్రభుత్వానికి ఎదురు తిరిగారు. దీంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది.

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రజలు ప్రభుత్వంపైకి తిరగబడ్డారు. పీఓకే ప్రాంతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వీధుల వెంబడి భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీంతో పీఓకేలోని పోలీసులు ఏకే-47 తో కాల్పుల వర్షం కురిపించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో విసిగిపోయిన అక్కడి ప్రజలు.. ప్రభుత్వంపైనే యుద్ధం ప్రకటించారు. ఈ క్రమంలోనే భారీగా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలతో కదం తొక్కారు. ఇక ఈ ఆందోళనలను అణిచివేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిరసనకారులను అడ్డుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పీఓకే మొత్తం రణరంగంగా మారింది.

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారీగా పెంచిన పన్నులు, అధిక ద్రవ్యోల్బణం, విద్యుత్ కొరత సహా అనేక సమస్యలకు వ్యతిరేకంగా స్థానికులు నిరసనలు చేస్తున్నారు. పీఓకే ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను పాకిస్థాన్‌లోని ఇతర పెద్ద నగరాలకు మళ్లించడంతో స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే శనివారం భారీ మార్చ్ చేపట్టారు. ఈ క్రమంలోనే వారిని అణిచివేసేందుకు పాకిస్తాన్ రేంజర్లు, స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. టియర్ గ్యాస్, పెల్లెట్లు, గాల్లోకి బుల్లెట్లను ప్రయోగించారు. ఈ క్రమంలోనే పోలీసులు, పారామిలటరీ బలగాలు జరిపిన దాడిలో ఇద్దరు ప్రజలు చనిపోయారు.

అయితే ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ ప్రజలు శాంతియుతంగానే నిరసన ప్రదర్శనను ప్రారంభించారు. ఈ ఆందోళనలను అణిచివేసేందుకు ప్రభుత్వం హింసాత్మక మార్గాలను ఎంచుకుంది. మొదట గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు.. ఆ తర్వాత టియర్ గ్యాస్ సహా ఇతర మార్గాలను ఎంచుకున్నారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు.. పోలీసులపైకి తిరగబడటంతో తీవ్ర ఘర్షణ వాతావరణం చెలరేగింది. అది కాస్తా హింసాత్మక ఘటనలకు దారి తీసింది.

ఈ క్రమంలోనే పోలీసులు ఏకే-47 లతో గాల్లోకి, నిరసనకారులపైకి కాల్పులు జరిపిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఆందోళనల్లో విద్యార్థులు, మహిళలు కూడా పాల్గొన్నారు. ఇద్దరు పౌరులు చనిపోగా.. పదుల సంఖ్యలో జనం గాయాలపాలయ్యారు. వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆస్పత్రుల్లో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.S1

తాజా వార్తలు

Airtel Digital TV అమెజాన్ ప్రైమ్‌తో సహకరిస్తుంది Airtel Digital TV అమెజాన్ ప్రైమ్‌తో సహకరిస్తుంది
ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ తన కొత్త అల్టిమేట్ మరియు అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్‌ను ప్రారంభించేందుకు అమెజాన్ ప్రైమ్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ఉత్తమమైన లైవ్...
US ఫెడ్ రేటు నిర్ణయం కంటే ముందే సెన్సెక్స్, నిఫ్టీ పెరుగుదల; ఓలా ఎలక్ట్రిక్ షేర్లు దూసుకుపోయాయి
స్మృతి ఇరానీ ప్రపంచ బ్యాంకు నేతలతో లింగ సమానత్వం గురించి చర్చించారు
అమెరికన్ జిమ్నాస్ట్ జోర్డాన్ చిలెస్ స్విస్ సుప్రీంకోర్టుకు ఒలింపిక్ కాంస్యాన్ని పునరుద్ధరించడానికి బిడ్ తీసుకున్నాడు
డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ 1-0తో చైనాను ఓడించి ఐదో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్‌ను గెలుచుకుంది.
టెస్టు సిరీస్‌లో భారత్‌ను ఓడించగలమని బంగ్లాదేశ్ నమ్ముతోంది: షోరిఫుల్ ఇస్లాం
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ నెలాఖరు నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయనుంది