సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ భార్య కృష్ణ కుమారి రాయ్ గురువారం తన ఎమ్మెల్యే పదవికి హఠాత్తుగా రాజీనామా చేశారు. ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే ఆమె ఎందుకు రాజీనామా చేశారో కారణాలుమాత్రం వెల్లడించలేదు. స్పీకర్ ఎంఎన్ షెర్పా ఆయన రాజీనామాను ఆమోదించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె నంచిసింగితాంగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన సీఎం ప్రేమ్‌సింగ్.. తన భార్య రాజీనామాపై ఫేస్‌బుక్‌లో స్పందించారు. పార్టీ సంక్షేమం, లక్ష్యాలకు ప్రాధాన్యత ఇస్తూ పార్టీ ఏకగ్రీవ నిర్ణయంతో కృష్ణకుమారి రాయ్ తన స్థానాన్ని ఖాళీ చేశారని ఆయన అన్నారు.ఎమ్మెల్యే కృష్ణారాయ్ కూడా ప్రజాసేవకే అంకితమవుతారని, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతారని, నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన అభ్యర్థులకు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.