ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు, బయటి నుంచి మద్దత్తు: దీదీ

  • కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు టీఎమ్‌సీ మద్దతు ఉంటుందన్న మమత
  • బెంగాల్‌లో మాత్రం త్రిముఖ పోటీయేనని స్పష్టీకరణ
  • బీజేపీ దొంగల పార్టీ అన్నది యావత్ దేశానికి తెలిసిందని విమర్శ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ కేంద్రంలో ఇండియా సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు బయటి నుంచి మద్దతిస్తామన్నారు. రాష్ట్రంలో ఇండియా కూటమి తో పొత్తు ఉండదని గత వారం స్పష్టం చేసిన మమత, తాజాగా తన వైఖరిని మరింత స్పష్టం చేశారు. “పశ్చిమ బెంగాల్‌లో ఇండియా కూటమి లేదు. ఈ కూటమి ఏర్పాటులో నేనే కీలకపాత్ర పోషించాను. కూటమి పేరు కూడా సూచించాను. కానీ రాష్ట్రంలో సీపీఐ(ఎం), కాంగ్రెస్‌...బీజేపీ వారి కోసం పని చేస్తున్నాయి. మమత గతవారం సంచలన ప్రకటన చేశారు. బుధవారం మమత తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. కాంగ్రెస్, సీపీఐ(ఎం)లపై ఆధారపడవద్దు, అవి మన కోసం కాదు, బీజేపీ కోసం అని.

కమలం పార్టీ పూర్తిగా దొంగలతో నిండిపోయిందని మమతా బెనర్జీ బీజేపీని విమర్శించారు. 400 సీట్లకు పైగా గెలవాలన్న బీజేపీ లక్ష్యం నెరవేరదని అన్నారు. బీజేపీ 400 సీట్లు గెలుచుకుంటుందని అంచనా. అయితే అది కుదరదని ప్రజలు అంటున్నారు. బీజేపీలో దొంగలు ఉన్నారని యావత్ దేశానికి అర్థమైంది. భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బయట నుంచి మేము మద్దతు ఇస్తాము. రాష్ట్రంలోని తల్లులు, అక్కాచెల్లెళ్లు, 100 రోజుల ఉపాధి పథకం కింద పనిచేస్తున్న వారికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు కేంద్రంలోని ఇండియా కూటమికి అండగా ఉంటామన్నారు. సీఏఏను రీఅప్పీల్ చేస్తామని, ఎన్‌ఆర్‌సీ, యూనిఫాం సివిల్ కోడ్ అమలు కాకుండా చూస్తామని స్పష్టం చేశారు.

About The Author: న్యూస్ డెస్క్