లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారం క్లైమాక్స్‌కు మోడీపై రాహుల్ విమర్శలు

 లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారం క్లైమాక్స్‌కు  మోడీపై రాహుల్ విమర్శలు

లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. బీహార్‌లో సోమవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ దేశంలో 22 మందిని రాజులు, మహారాజులు చేశారని, వారి పేర్లు మాత్రం వేరుగా ఉన్నాయని అన్నారు.అందులో అదానీ, అంబానీ పేర్లు ఉన్నాయని, వారి కోసం నరేంద్ర మోదీ 24 గంటలు కష్టపడతారన్నారు. కోటీశ్వరుల అభివృద్ధికి ప్రధాని అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని ఆరోపించారు.  పేదల సమస్యలు, ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యపై కాషాయ పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.దేశ సంపద సంపన్నుల నుంచి దోచుకున్నారని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ఈ మోసాన్ని అరికట్టాలని, బీహార్ యువతలో ఎంతమందికి దేశంలో ఉద్యోగాలు వస్తున్నాయో చెప్పాలని ప్రధాని మోదీ కోరారు. పనికిమాలిన ఉపన్యాసాలు ఇవ్వడం, ప్రజల మధ్య చిచ్చు పెట్టడం మానుకోవాలని ప్రధాని మోదీని కోరారు.

తాజా వార్తలు

Airtel Digital TV అమెజాన్ ప్రైమ్‌తో సహకరిస్తుంది Airtel Digital TV అమెజాన్ ప్రైమ్‌తో సహకరిస్తుంది
ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ తన కొత్త అల్టిమేట్ మరియు అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్‌ను ప్రారంభించేందుకు అమెజాన్ ప్రైమ్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ఉత్తమమైన లైవ్...
US ఫెడ్ రేటు నిర్ణయం కంటే ముందే సెన్సెక్స్, నిఫ్టీ పెరుగుదల; ఓలా ఎలక్ట్రిక్ షేర్లు దూసుకుపోయాయి
స్మృతి ఇరానీ ప్రపంచ బ్యాంకు నేతలతో లింగ సమానత్వం గురించి చర్చించారు
అమెరికన్ జిమ్నాస్ట్ జోర్డాన్ చిలెస్ స్విస్ సుప్రీంకోర్టుకు ఒలింపిక్ కాంస్యాన్ని పునరుద్ధరించడానికి బిడ్ తీసుకున్నాడు
డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ 1-0తో చైనాను ఓడించి ఐదో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్‌ను గెలుచుకుంది.
టెస్టు సిరీస్‌లో భారత్‌ను ఓడించగలమని బంగ్లాదేశ్ నమ్ముతోంది: షోరిఫుల్ ఇస్లాం
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ నెలాఖరు నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయనుంది