విమానాన్ని రన్‌వేపైకి తీసుకొచ్చిన వాహనాన్ని ఢీకొట్టిన ఎయిర్ ఇండియా విమానం

విమానాన్ని రన్‌వేపైకి తీసుకొచ్చిన వాహనాన్ని ఢీకొట్టిన ఎయిర్ ఇండియా విమానం

  • పూణె విమానాశ్రయంలో ఘటన
  • విమానంలో 180 మంది ప్రయాణికులు
  • విచారణకు ఆదేశించిన డీజీసీఏ

నిన్న ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిరిండియా విమానానికి పూణె విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్‌కు ముందు రన్‌వేపైకి తీసుకొచ్చిన టగ్ ట్రక్‌నే ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఈ ప్రమాదంలో విమానం ముక్కుకు, ల్యాండింగ్ గేర్ దగ్గర ఉన్న టైరు బాగా దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. అయితే విమానానికి ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఘటన అనంతరం వారందరినీ దింపి విమానాన్ని మరమ్మతుల కోసం తరలించారు. అనంతరం వారిని ప్రత్యామ్నాయ విమానంలో ఢిల్లీకి పంపించారు. విమానం, టగ్ట్రక్‌ ఢీకొనడానికి గల కారణాలపై దర్యాప్తునకు డీజీసీఏ ఆదేశించింది. ఈ ఘటనతో విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని అధికారులు తెలిపారు.

తాజా వార్తలు

Airtel Digital TV అమెజాన్ ప్రైమ్‌తో సహకరిస్తుంది Airtel Digital TV అమెజాన్ ప్రైమ్‌తో సహకరిస్తుంది
ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ తన కొత్త అల్టిమేట్ మరియు అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్‌ను ప్రారంభించేందుకు అమెజాన్ ప్రైమ్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ఉత్తమమైన లైవ్...
US ఫెడ్ రేటు నిర్ణయం కంటే ముందే సెన్సెక్స్, నిఫ్టీ పెరుగుదల; ఓలా ఎలక్ట్రిక్ షేర్లు దూసుకుపోయాయి
స్మృతి ఇరానీ ప్రపంచ బ్యాంకు నేతలతో లింగ సమానత్వం గురించి చర్చించారు
అమెరికన్ జిమ్నాస్ట్ జోర్డాన్ చిలెస్ స్విస్ సుప్రీంకోర్టుకు ఒలింపిక్ కాంస్యాన్ని పునరుద్ధరించడానికి బిడ్ తీసుకున్నాడు
డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ 1-0తో చైనాను ఓడించి ఐదో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్‌ను గెలుచుకుంది.
టెస్టు సిరీస్‌లో భారత్‌ను ఓడించగలమని బంగ్లాదేశ్ నమ్ముతోంది: షోరిఫుల్ ఇస్లాం
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ నెలాఖరు నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయనుంది