క్యాపిటల్స్‌ ప్లేఆఫ్స్‌ ఆశలపై నీళ్లు చల్లిన బెంగళూరు

క్యాపిటల్స్‌ ప్లేఆఫ్స్‌ ఆశలపై నీళ్లు చల్లిన బెంగళూరు

  • రాణించిన పాటిదార్‌, జాక్స్‌ ఐదో స్థానానికి ఆర్సీబీ

ప్లేఆఫ్స్‌ రేసులో ముందంజ వేసి నాకౌట్‌ ఆశలు నిలుపుకోవాల్సిన కీలకపోరులో చేతులెత్తేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. ఆ రేసు నుంచి తప్పుకున్నట్టే! ఆదివారం ‘చిన్నస్వామి’ వేదికగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)తో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ బంతితో పాటు బ్యాట్‌తోనూ తడబడి మూల్యం చెల్లించుకుంది. సమిష్టి ప్రదర్శనతో వరుసగా ఐదో విజయం అందుకున్న బెంగళూరు.. 6 విజయాలు 12 పాయింట్లతో ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

బెంగళూరు: ఐపీఎల్‌-17 ప్లేఆఫ్స్‌ రేసులో ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తప్పటడుగులు వేసి తగిన మూల్యం చెల్లించుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు.. 47 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. రజత్‌ పాటిదార్‌ (32 బంతుల్లో 52, 3 ఫోర్లు, 3 సిక్సర్లు), విల్‌ జాక్స్‌ (29 బంతుల్లో 41, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులతో 20 ఓవర్లలో 187/9 పరుగులు చేసింది. ఛేదనలో ఢిల్లీ.. 19.1 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌట్‌ అయింది. అక్షర్‌ పటేల్‌ (39 బంతుల్లో 57, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆ జట్టును ఆదుకున్నాడు. ఆర్సీబీ బౌలర్లలో యశ్‌ దయాల్‌ (3/20), ఫెర్గూసన్‌ (2/23) రాణించారు. కామెరూన్‌ గ్రీన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

మిడిలార్డర్‌ జోరు
ఆర్సీబీ సారథి ఫాఫ్‌ డుప్లెసిస్‌ (6) మరోసారి నిరాశపరచగా కోహ్లీ (13 బంతుల్లో 27, 1 ఫోర్‌, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడినట్టే అనిపించినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. 36 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీని జాక్స్‌, పాటిదార్‌ ఆదుకున్నారు. ఢిల్లీ ఫీల్డర్లు ఈ ఇద్దరూ ఇచ్చిన క్యాచ్‌లను నేలపాలు చేయడం వారికి కలిసొచ్చింది. 29 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్న పాటిదార్‌.. రసిక్‌ 13వ ఓవర్లో అక్షర్‌ పటేల్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో 88 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఆఖర్లో గ్రీన్‌ (24 బంతుల్లో 32 నాటౌట్‌, 1 ఫోర్‌, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు.

ఢిల్లీ ఏ దశలోనూ..
ఢిల్లీ ఆదినుంచే తడబడింది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన డేవిడ్‌ వార్నర్‌ (1) నాలుగో బంతికే ఔట్‌ అయ్యాడు. జేక్‌ ఫ్రేజర్‌ (13 బంతుల్లో 27, 1 ఫోర్‌, 3 సిక్సర్లు) ఎప్పటిలాగే దూకుడుగా ఆడాడు. కానీ దురదృష్టవశాత్తూ యశ్‌ ఠాకూర్‌ 3వ ఓవర్‌ రెండో బంతికి రనౌట్‌ అయ్యాడు. పొరెల్‌ (2) ఫెర్గూసన్‌ చేతికి చిక్కాడు. కుశాగ్ర (2) ను సిరాజ్‌ ఎల్బీడబ్ల్యూ చేశాడు. దయాల్‌ 5వ ఓవర్లో 3 ఫోర్లు కొట్టి ఊపు మీద కనిపించిన షై హోప్‌ (29)ను ఫెర్గూసన్‌ వెనక్కి పంపాడు. ఢిల్లీ భారీ ఆశలు పెట్టుకున్న ట్రిస్టన్‌ స్టబ్స్‌ (3) రనౌట్‌ అవడంతో ఆ జట్టు 90 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమిని ఖరారుచేసుకుంది. కానీ తాత్కాలిక సారథి అక్షర్‌ పటేల్‌ మెరుపులతో ఆ జట్టు ఓటమి అంతరం కొంత తగ్గింది.

సంక్షిప్త స్కోర్లు
బెంగళూరు: 20 ఓవర్లలో 187/9 (రజత్‌ 52, జాక్స్‌ 41, రసిక్‌ 2/23, ఖలీల్‌ 2/31) . ఢిల్లీ: 19.1 ఓవర్లలో 140 (అక్షర్‌ 57, షై హోప్‌ 29, దయాల్‌ 3/20, ఫెర్గూసన్‌ 2/23)

 

 

 

తాజా వార్తలు

Airtel Digital TV అమెజాన్ ప్రైమ్‌తో సహకరిస్తుంది Airtel Digital TV అమెజాన్ ప్రైమ్‌తో సహకరిస్తుంది
ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ తన కొత్త అల్టిమేట్ మరియు అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్‌ను ప్రారంభించేందుకు అమెజాన్ ప్రైమ్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ఉత్తమమైన లైవ్...
US ఫెడ్ రేటు నిర్ణయం కంటే ముందే సెన్సెక్స్, నిఫ్టీ పెరుగుదల; ఓలా ఎలక్ట్రిక్ షేర్లు దూసుకుపోయాయి
స్మృతి ఇరానీ ప్రపంచ బ్యాంకు నేతలతో లింగ సమానత్వం గురించి చర్చించారు
అమెరికన్ జిమ్నాస్ట్ జోర్డాన్ చిలెస్ స్విస్ సుప్రీంకోర్టుకు ఒలింపిక్ కాంస్యాన్ని పునరుద్ధరించడానికి బిడ్ తీసుకున్నాడు
డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ 1-0తో చైనాను ఓడించి ఐదో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్‌ను గెలుచుకుంది.
టెస్టు సిరీస్‌లో భారత్‌ను ఓడించగలమని బంగ్లాదేశ్ నమ్ముతోంది: షోరిఫుల్ ఇస్లాం
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ నెలాఖరు నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయనుంది