SRH హైదరాబాద్ మేనేజ్మెంట్ తో కేన్ విలియమ్సన్

 SRH హైదరాబాద్ మేనేజ్మెంట్ తో కేన్ విలియమ్సన్

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో గురువారం గుజరాత్ టైటాన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఇరు జట్లూ ఒక్కో పాయింట్‌ సాధించాయి. ఫలితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ 15 పాయింట్లతో ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. మరోవైపు లీగ్ సీజన్‌ను గుజరాత్ 12 పాయింట్లతో ముగించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఇరు జట్ల ఆటగాళ్లు తమ లాకర్ రూమ్‌లలోనే ఉండాల్సి వచ్చింది. అయితే ఆట రద్దయిన తర్వాత ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ఆటగాడు కేన్ విలియమ్సన్ SRH మేనేజ్‌మెంట్ మరియు ఆటగాళ్లతో గడిపాడు. ఈ సీజన్‌లో కేన్ విలియమ్సన్ గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. కావ్య మారన్ మరియు కేన్ విలియమ్సన్ కౌగిలించుకొని, ఆత్మీయంగా మాట్లాడి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.  ఈ వీడియోను సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. 

తాజా వార్తలు

Airtel Digital TV అమెజాన్ ప్రైమ్‌తో సహకరిస్తుంది Airtel Digital TV అమెజాన్ ప్రైమ్‌తో సహకరిస్తుంది
ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ తన కొత్త అల్టిమేట్ మరియు అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్‌ను ప్రారంభించేందుకు అమెజాన్ ప్రైమ్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ఉత్తమమైన లైవ్...
US ఫెడ్ రేటు నిర్ణయం కంటే ముందే సెన్సెక్స్, నిఫ్టీ పెరుగుదల; ఓలా ఎలక్ట్రిక్ షేర్లు దూసుకుపోయాయి
స్మృతి ఇరానీ ప్రపంచ బ్యాంకు నేతలతో లింగ సమానత్వం గురించి చర్చించారు
అమెరికన్ జిమ్నాస్ట్ జోర్డాన్ చిలెస్ స్విస్ సుప్రీంకోర్టుకు ఒలింపిక్ కాంస్యాన్ని పునరుద్ధరించడానికి బిడ్ తీసుకున్నాడు
డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ 1-0తో చైనాను ఓడించి ఐదో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్‌ను గెలుచుకుంది.
టెస్టు సిరీస్‌లో భారత్‌ను ఓడించగలమని బంగ్లాదేశ్ నమ్ముతోంది: షోరిఫుల్ ఇస్లాం
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ నెలాఖరు నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయనుంది