రైతులకు ఉచితంగా పంపుసెట్లు సరఫరా చేయాలని తెలంగాణ సీఎం అధికారులకు సూచించారు

రాష్ట్రంలోని రైతులకు ఉచితంగా పంపుసెట్లు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి నుంచి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని అధికారులను కోరారు.

బుధవారం ఆయన ఇంధన శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు.

వివిధ శాఖల్లో నిరుపయోగంగా ఉన్న భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు.

వంటగ్యాస్‌కు బదులుగా సోలార్‌ సిలిండర్‌ వ్యవస్థను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. మహిళా సంఘాలకు వీటిపై శిక్షణ ఇచ్చి సోలార్ సిలిండర్ వ్యాపారం వైపు ప్రోత్సహించాలి. అటవీ భూముల్లో కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలి.

ఏటా 40 వేల మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాపార కేంద్రంగా మారబోతోంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావాలి. ఐటీ, పరిశ్రమల శాఖల సమన్వయంతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి. డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకోండి’’ అని సీఎం చెప్పారు.

About The Author: న్యూస్ డెస్క్