కరువు తెచ్చిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

కరువు తెచ్చిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

పార్లమెంట్‌ ఎన్నికల్లో కరువు తెచ్చిన కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని, కారు గుర్తుకు ఓటు వేసి మల్కాజిగిరి బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో కరువు తెచ్చిన కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని, కారు గుర్తుకు ఓటు వేసి మల్కాజిగిరి బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో శనివారం నిర్వహించిన రోడ్‌ షో కార్నర్‌ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ అంటేనే కరువు.. రాష్ట్రంలో ఆ పార్టీ పాలన చేపట్టిన ఐదు నెలలకే నీళ్లు లేవు.. కరెంట్‌ కట్‌..కేసీఆర్‌ కిట్‌ ఆగిపోయాయి.

ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు’ అని చెప్పారు. కాంగ్రెస్‌ అంటే అన్ని బంద్‌ చేసే పార్టీ అని, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తెలిసీ తెలియక మరిచిపోయి కాంగ్రెస్‌ను గెలిపించారన్నారు. మంచినీటికే కటకట ఏర్పడి ట్యాంకర్ల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చిందన్నారు. 70 ఏండ్ల కాలంలో కాంగ్రెస్‌, బీజేపీలు ప్రజలకు చేసిందేమీలేదని, పదేండ్లలో సీఎం కేసీఆర్‌ ప్రజలకు అవసరమైన పథకాలను అందించారని పేర్కొన్నారు.

వృద్ధాప్య పింఛన్లు, కేసీఆర్‌ కిట్‌, ఆడబిడ్డలకు ఆర్థిక సాయం రావాలంటే.. కారు గుర్తుకు ఓటు వేసి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించుకోవాలని ఎమ్మెల్యే మల్లారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్లు జైపాల్‌రెడ్డి, బాల్‌రాజ్‌, హేమంత్‌రెడ్డి, పెంటయ్య, కో ఆప్షన్‌ సభ్యుడు దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Telangana

తాజా వార్తలు

2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా  2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా
యూఎస్‌ఏ, వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు విజయాన్ని అందించిన తర్వాత ఇటీవలే టీ20ల నుంచి రిటైరయిన రోహిత్ శర్మ వచ్చే ఏడాది జరగబోయే రెండు ముఖ్యమైన...
నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలు, ముగింపు ఫ్లాట్; మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్, FMCG పతనం
శ్రీలంక LPG కంపెనీ మరియు టెర్మినల్ కోసం ఎనిమిది మంది బిడ్డర్లలో భారత్ పెట్రోలియం
భారతదేశంలో కొత్త కొడియాక్, ఆక్టేవియాను పరిచయం చేయడానికి స్కోడా సిద్ధమైంది
IRFC, RVNL మరియు IRCTC వంటి రైల్వే స్టాక్‌లు నేడు ఎందుకు లాభపడుతున్నాయి??
ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వీపీ హేమంత లాంబా రాజీనామా
'మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తాం': వినియోగదారులు గ్లిచ్ తర్వాత జెరోధాను