రెండు గ్రామాల్లో వంద శాతం పోలింగ్‌!

రెండు గ్రామాల్లో వంద శాతం పోలింగ్‌!

  • ప్ర‌జాస్వామ్య విలువ‌ను చాటి చెప్పిన తెలంగాణ ప‌ల్లెలు
  • జగిత్యాల జిల్లా చిన్నకొల్వాయిలో వంద‌ శాతం పోలింగ్‌
  • అలాగే మెదక్‌ జిల్లా సంగాయిపేట తండాలోనూ ఓటర్ల‌ చైతన్యం

తెలంగాణలోని ఈ రెండు గ్రామాలు ప్రజాస్వామ్య విలువను చాటిచెప్పాయి. ఓటర్లు ఓటువేసి తమ చైతన్యాన్ని వ్యక్తం చేశారు. లోక్‌సభ నాలుగో దశ ఎన్నికల పోలింగ్‌ సోమవారం రాష్ట్రంలో జరిగింది. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం చిన్నకొల్వాయిలో 100 శాతం పోలింగ్‌ నమోదైంది. గ్రామంలో 110 మంది ఓటర్లు ఉండగా, వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం. వందశాతం ఓటింగ్‌కు కృషి చేసిన సెక్టార్‌ అధికారి శక్రునాయక్‌, కార్యదర్శి ముద్దం విజయ్‌, బీఎల్‌ఓ యశోద, రూట్‌ అధికారి రాజ్‌కుమార్‌లను కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా ప్రత్యేకంగా అభినందించారు.

అదేవిధంగా మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట తండాలో 100 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ తండాలో ఏర్పాటు చేసిన అదనపు పోలింగ్ కేంద్రం 62ఏలో 210 మంది ఓటర్లు ఉన్నారు, అంద‌రూ ఓటు వేశారు. పోలింగ్ కేంద్రంలో 95 మంది పురుష ఓటర్లు, 115 మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తేలింది. సంగాయిపేట తండా ప్రజలకు మెదక్ కలెక్టర్ అభినందనలు తెలిపారు.

ఇదిలావుంటే, సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణలో 61 శాతం ఎన్నికలు నమోదైనట్లు ఈసీ నివేదించింది. ముఖ్యంగా గ్రామీణ తెలంగాణలో పోలింగ్ శాతం దాదాపు 70 శాతం దాటింది.

Tags: Telangana

తాజా వార్తలు

2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా  2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా
యూఎస్‌ఏ, వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు విజయాన్ని అందించిన తర్వాత ఇటీవలే టీ20ల నుంచి రిటైరయిన రోహిత్ శర్మ వచ్చే ఏడాది జరగబోయే రెండు ముఖ్యమైన...
నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలు, ముగింపు ఫ్లాట్; మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్, FMCG పతనం
శ్రీలంక LPG కంపెనీ మరియు టెర్మినల్ కోసం ఎనిమిది మంది బిడ్డర్లలో భారత్ పెట్రోలియం
భారతదేశంలో కొత్త కొడియాక్, ఆక్టేవియాను పరిచయం చేయడానికి స్కోడా సిద్ధమైంది
IRFC, RVNL మరియు IRCTC వంటి రైల్వే స్టాక్‌లు నేడు ఎందుకు లాభపడుతున్నాయి??
ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వీపీ హేమంత లాంబా రాజీనామా
'మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తాం': వినియోగదారులు గ్లిచ్ తర్వాత జెరోధాను