వనపర్తి జిల్లాలో బీఆర్‌ఎస్‌ నేత దారుణ హత్య.

వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి(45) దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబాబి మండలం లక్ష్మీపల్లిలో అర్థరాత్రి చోటుచేసుకుంది. రాత్రి ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో ఎవరో గొడ్డలితో తల నరికారు.

దివంగత శ్రీధర్ రెడ్డి కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఈ హత్యపై హర్షవర్ధన్ రెడ్డి స్పందించారు. రాజకీయ కారణాలతోనే శ్రీధర్‌రెడ్డిని హత్య చేశారని ఆరోపించారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నేతలను టార్గెట్‌ చేశారన్నారు.

బీఆర్‌ఎస్‌ మద్దతుదారులపై ఇటీవల వరుసగా దాడులు జరుగుతున్నాయని హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. డీజీపీకి ఫిర్యాదు చేసినా ఏమీ సాధించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About The Author: న్యూస్ డెస్క్