హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎల్బీనగర్, హయత్ నగర్, వనస్థలిపురం, నాగోల్, గాడిఅన్నారం, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట, అబిడ్స్, అంబర్ పేట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆయా ప్రాంతాల్లోని వీధులన్నీ నీటితో నిండిపోయాయి. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.

About The Author: న్యూస్ డెస్క్