వడ్లు కొనకపోతే ఓట్లేయం

వడ్లు కొనకపోతే ఓట్లేయం

కొద్ది వారాలుగా రాష్ట్రంలో రైతు రోడ్డెక్కని రోజు లేదు.. ఆందోళనకు దిగని దినం లేదు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామంటూ ప్రభుత్వం లెక్కలు చెప్తున్నప్పటికీ.. కాంటా జరుగదు.

  • అంబాజీపేట కొనుగోలు కేంద్రంలో 10 రోజులుగా నిలిచిన కాంటా
  • వానలతో రైతుల ఆందోళన.. అయినా తూకమేయని అధికారులు
  • వడ్లు వెంటనే కొనాలంటూ మెదక్‌ – చేగుంట హైవేపై రాస్తారోకో
  • సర్కారు దిగిరాకుంటే ఓటింగ్‌లో పాల్గొనబోమంటూ రైతుల హెచ్చరిక
  • చిన్నశంకరంపేట, : కొద్ది వారాలుగా రాష్ట్రంలో రైతు రోడ్డెక్కని రోజు లేదు.. ఆందోళనకు దిగని దినం లేదు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామంటూ ప్రభుత్వం లెక్కలు చెప్తున్నప్పటికీ.. కాంటా జరుగదు. మద్దతు దొరకదు. దళారీ చెప్పిందే ధర. కొన్నదే ధాన్యం. వడ్లు కుప్ప పోసుకుని కూర్చున్న రైతు సాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. గాలివానో, రాళ్లవానో వస్తే.. ధాన్యం తడువకుండా తండ్లాడుతూనే ఉన్నాడు. రాష్ట్రమంతా కొనుగోళ్లు సాఫీగా సాగుతున్నాయని మంత్రులు చెప్తుంటే.. మరి రోడ్డెక్కుతున్న రైతులంతా ఎవరు? పంట కొంటరేమోనన్న తండ్లాటలో కోల్పోతున్న ప్రాణాలెవరివి? వడ్లకుప్ప వద్దే కుప్పకూలినవాళ్ల జాబితాలో ఇప్పుడు మరో ఇద్దరు చేరారు.
  • ధాన్యం కొనాలని రైతుల రాస్తారోకో
    ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట కొనుగోలు కేంద్రం వద్ద ఆదివారం రైతులు మెదక్‌-చేగుంట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రంలో వారం పది రోజులుగా ధాన్యాన్ని తూకం వేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళారుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ధాన్యం తూకం వేయకపోవడం లేదని ఆరోపించారు. తమ ధాన్యాన్ని తూకం వేయకుంటే సోమవారం జరిగే ఎంపీ ఎన్నికల్లో తాము ఓటింగ్‌లో పాల్గొనబోమని తేల్చిచెప్పారు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం అకాల వర్షంతో తడసి ముద్దవుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దళారులపై ఉన్న ప్రేమ రైతులపై ఎందుకు లేదని ప్రశ్నించారు. తమ ధాన్యాన్ని తూకం వేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని అన్నదాతలు హెచ్చరించారు.
Tags: Telangana

తాజా వార్తలు

2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా  2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా
యూఎస్‌ఏ, వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు విజయాన్ని అందించిన తర్వాత ఇటీవలే టీ20ల నుంచి రిటైరయిన రోహిత్ శర్మ వచ్చే ఏడాది జరగబోయే రెండు ముఖ్యమైన...
నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలు, ముగింపు ఫ్లాట్; మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్, FMCG పతనం
శ్రీలంక LPG కంపెనీ మరియు టెర్మినల్ కోసం ఎనిమిది మంది బిడ్డర్లలో భారత్ పెట్రోలియం
భారతదేశంలో కొత్త కొడియాక్, ఆక్టేవియాను పరిచయం చేయడానికి స్కోడా సిద్ధమైంది
IRFC, RVNL మరియు IRCTC వంటి రైల్వే స్టాక్‌లు నేడు ఎందుకు లాభపడుతున్నాయి??
ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వీపీ హేమంత లాంబా రాజీనామా
'మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తాం': వినియోగదారులు గ్లిచ్ తర్వాత జెరోధాను