మెదక్ ఎంపీ అభ్యర్థి ఈశ్వర్ ను గెలిపించాలి

మెదక్ ఎంపీ అభ్యర్థి ఈశ్వర్ ను గెలిపించాలి

బి ఎస్ పి ఆధ్వర్యంలో బారి బైక్ ర్యాలీ

బి ఎస్ పి జిల్లా అధ్యక్షులు ఓం ప్రకాష్ 


గజ్వేల్ ప్రతినిధి మే 11 
( నేటి పౌరుషం ) :

గజ్వెల్ పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కోట మైసమ్మ దేవాలయం నుండి ప్రజ్ఞాపూర్ మీదుగా తిరిగి గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వరకు బారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. తదనంతరం మెదక్ పార్లమెంటు అభ్యర్థి బొడుపట్ల ఈశ్వర్  సెంట్రోల్ కో ఆర్డినేటర్ బీఎస్పీ తెలంగాణ బాలయ్య, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఓం ప్రకాష్ , జిల్లా ఆర్గనైజేషన్ నరేష్, గజ్వేల్ ఇంచార్జి వినోద్ చారి, మాజీ నియోజకవర్గ అధ్యక్షులు మొండి కరుణాకర్, గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు కానుగుల రమనాకర్, ఉపాధ్యక్షులు గుర్రం ఎల్లం ప్రధాన కార్యదర్శి జోడుముంతల నవీన్  కోశాధికారి కనకప్రసాద్  ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మెదక్ ఎం పి అభ్యర్థి బి సి, ఎస్ సి, ఎస్ టి, మైనారిటీ జీవితాల్లో వెలుగులు నింపాలంటే ఏనుగు గుర్తుకు ఓటు వేసి బహుజన్ సమాజ్ పార్టీ గెలిపించాలని కోరారు. 75 ఏళ్లలో అగ్రవర్ణ పార్టీలు అనేకం ఉన్నాయని కానీ బహుజనులకు ఉన్న ఏకైక పార్టీ బి ఎస్ పి అని తెలిపారు. సెంట్రల్ కో-ఆర్డినేటర్ బాలయ్య  మాట్లాడుతూ భారతదేశంలో బహుజనులకు హక్కులు కల్పించిన రాజ్యాంగాన్ని రానున్న రోజుల్లో రద్దు చేయడానికి అన్ని అగ్ర కుల పార్టీలు ఏకమై పనిచేస్తున్నాయని తెలిపారు. రాజ్యాంగాన్ని  కాపాడుకోవాలంటే బహుజనులు అంతా ఏకమై ఏనుగు గుర్తు ఓటు వేయాలని తెలిపారు. రానున్న రోజుల్లో బహుజన రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇట్టి కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఓం ప్రకాష్ జిల్లా ఆర్గనైజేషన్ నరేష్  గజ్వేల్ ఇంచార్జి వినోద్ చారి గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు కానుగుల రమనాకర్ , ఉపాధ్యక్షులు గుర్రం ఎల్లం, ప్రధాన కార్యదర్శి జోడు ముంతల నవీన్,  కోశాధికారి కనక ప్రసాద్ మరియు కుకునూరు పల్లి మండల అధ్యక్షులు బక్కోళ్ల కరుణాకర్ మరియు మండల కమిటీ నాయకులు గ్రామ కమిటీ నాయకులు పాల్గొన్నారు.

Tags: Telangana

తాజా వార్తలు

2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా  2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా
యూఎస్‌ఏ, వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు విజయాన్ని అందించిన తర్వాత ఇటీవలే టీ20ల నుంచి రిటైరయిన రోహిత్ శర్మ వచ్చే ఏడాది జరగబోయే రెండు ముఖ్యమైన...
నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలు, ముగింపు ఫ్లాట్; మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్, FMCG పతనం
శ్రీలంక LPG కంపెనీ మరియు టెర్మినల్ కోసం ఎనిమిది మంది బిడ్డర్లలో భారత్ పెట్రోలియం
భారతదేశంలో కొత్త కొడియాక్, ఆక్టేవియాను పరిచయం చేయడానికి స్కోడా సిద్ధమైంది
IRFC, RVNL మరియు IRCTC వంటి రైల్వే స్టాక్‌లు నేడు ఎందుకు లాభపడుతున్నాయి??
ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వీపీ హేమంత లాంబా రాజీనామా
'మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తాం': వినియోగదారులు గ్లిచ్ తర్వాత జెరోధాను