పెంపుడు కుక్క కరిచిందని యజమాని పై దాడి, వీడియో వైరల్

పెంపుడు కుక్క కరిచిందని యజమాని పై దాడి, వీడియో వైరల్

  • పెంపుడు కుక్క కరవడంతో మధురానగర్ లో రెండు కుటుంబాల మధ్య గొడవ
  • ఎలెక్షన్ల వల్ల పోలీసులు వెంటనే స్పందించకపోవడం తో వారం తర్వాత కర్రలతో దాడి 

పెంపుడు కుక్క రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. కర్రలు, రాళ్లతో దాడి చేసుకునేదాకా తెచ్చింది. . తాము ప్రేమగా పెంచుకున్న కుక్క అదే వీధిలో నివసిస్తున్న మరో కుటుంబానికి చెందిన వ్యక్తిని కరవడంతో గొడవ మొదలైంది. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మరుసటిరోజు రోడ్డు మీద కుక్కతో కనిపించిన యువకుడిని పట్టుకుని చితకబాదారు. అడ్డుకున్న మహిళలపై కూడా కర్రలతో దాడి చేశారు. కొద్దిసేపటికి చుట్టుపక్కల వ్యక్తులు కూడా కనిపించడంతో వారు శాంతించారు. దాడిలో యువకుడి కుటుంబీకులు గాయపడడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించారు. దాడి మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురానగర్‌లో మధు, ధనుంజయ్ కుటుంబాల మధ్య గొడవ జరిగింది. గత బుధవారం మధు కుక్క ధనుంజయ కుటుంబసభ్యుడిని కరిచింది. దీంతో ధనుంజయ్ మధు కుటుంబీకులతో వాగ్వాదానికి దిగి సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒక వారం తర్వాత, మంగళవారం సాయంత్రం, మధు సోదరుడు శ్రీనాథ్ తన కుక్కను వాకింగ్ తీసుకెళ్లాడు. కుక్కతో రోడ్డుపై వెళ్తున్న శ్రీనాథ్ ను చూసి ధనుంజయ కుటుంబ సభ్యులు రెచ్చిపోయారు. కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. కుక్కపై కూడా దాడి చేశారు. గొడవను చూసిన శ్రీనాథ్ చెల్లి, తల్లి అడ్డుకునేందుకు పరుగెత్తారు. అయినా ధనుంజయ్ కుటుంబానికి చెందిన యువకులు కర్రలతో కొట్టడం ఆపలేదు. దీంతో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. ఇంతలో చుట్టుపక్కల ప్రజలు అక్కడికి చేరుకోవడంతో యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శ్రీనాథ్‌, అతని సోదరి, తల్లిని ఆస్పత్రికి, కుక్కను వెటర్నరీ క్లినిక్‌కి తరలించారు. శ్రీనాథ్ ఫిర్యాదు మేరకు ధనుంజయ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.

Tags: Telangana

తాజా వార్తలు

2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా  2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా
యూఎస్‌ఏ, వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు విజయాన్ని అందించిన తర్వాత ఇటీవలే టీ20ల నుంచి రిటైరయిన రోహిత్ శర్మ వచ్చే ఏడాది జరగబోయే రెండు ముఖ్యమైన...
నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలు, ముగింపు ఫ్లాట్; మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్, FMCG పతనం
శ్రీలంక LPG కంపెనీ మరియు టెర్మినల్ కోసం ఎనిమిది మంది బిడ్డర్లలో భారత్ పెట్రోలియం
భారతదేశంలో కొత్త కొడియాక్, ఆక్టేవియాను పరిచయం చేయడానికి స్కోడా సిద్ధమైంది
IRFC, RVNL మరియు IRCTC వంటి రైల్వే స్టాక్‌లు నేడు ఎందుకు లాభపడుతున్నాయి??
ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వీపీ హేమంత లాంబా రాజీనామా
'మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తాం': వినియోగదారులు గ్లిచ్ తర్వాత జెరోధాను