ఆ సీటు కాంగ్రెస్ పాకెట్‌లో ఉన్నట్లేనా.. అందుకే సీఎం రేవంత్ ప్రచారానికి వెళ్లలేదా..?

ఆ సీటు కాంగ్రెస్ పాకెట్‌లో ఉన్నట్లేనా.. అందుకే సీఎం రేవంత్ ప్రచారానికి వెళ్లలేదా..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ అదే రిజల్ట్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ రిపీట్ చేయాలని భావిస్తోంది. అందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపింది. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపింది. సీఎం రేవంత్ రెడ్డి అన్నీ తానై.. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు, స్టీట్ కార్నర్ మీటింగ్‌లు, సుడిగాలి పర్యటనలతో మెుత్తం 16 పార్లమెంట్ స్థానాల్లో 49 చోట్ల రేవంత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజల్ని కోరారు.

అయితే తెలంగాణలో మెుత్తం 17 లోక్ సభ స్థానాలు ఉండగా.. ఓ నియోజకవర్గంలో మాత్రం ఆయన కాలు పెట్టలేదు. ఆయనే కాదు మిగతా నియోజకవర్గాల్లో పార్టీ అగ్రనేతలు, రాహుల్, ప్రియాంక, ఖర్గే వంటి నేతలు ప్రచారం చేసినా.. ఆ స్థానంలో మాత్రం జిల్లా మంత్రులే అన్నీ తామై ప్రచారం నిర్వహించారు. అదే నల్గొండ లోక్‌సభ స్థానం. ఇక్కడ పార్టీ సీనియర్‌ నేత కుందూరు జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్‌రెడ్డి పోటీచేస్తుండగా.. అగ్రనేతలు అక్కడకు ప్రచారానికి వెళ్లలేదు. నల్గొండ నియోజకవర్గంలో పార్టీకి విజయావకాశాలున్నాయని తొలి నుంచి కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్‌కు ఈ స్థానం కంచుకోట అని చెబుతున్నారు. దీంతో నల్గొండలో సీఎం రేవంత్‌ సహా అగ్రనేతల సభలేవీ పెట్టలేదు. ఆ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, అదే జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి అన్నీ తామై ప్రచారం నిర్వహించారు.

ఇక కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తామని భావిస్తున్న ఖమ్మం, మహబూబాబాద్‌, భువనగిరి నియోజకవర్గాల్లోనూ సీఎం రేవంత్ ఒక్కో సభలో మాత్రమే సీఎం ప్రసంగించారు. ఖమ్మంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రచారం నిర్వహించారు. పార్టీకి విజయావకాశాలు బలంగా ఉన్నాయనుకున్న చోట తక్కువ సంఖ్యలో, గట్టిపోటీ ఉందనుకున్న స్థానాల్లో ఎక్కువ ప్రచార సభలు నిర్వహించారు రేవంత్. అత్యధికంగా మల్కాజిగిరిలో 9, మహబూబ్‌నగర్‌, చేవెళ్ల పార్లమెంట్ స్థానాల్లో 7 చొప్పున సభల్లో సీఎం ప్రసంగించారు.

S1

Tags: Telangana

తాజా వార్తలు

2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా  2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా
యూఎస్‌ఏ, వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు విజయాన్ని అందించిన తర్వాత ఇటీవలే టీ20ల నుంచి రిటైరయిన రోహిత్ శర్మ వచ్చే ఏడాది జరగబోయే రెండు ముఖ్యమైన...
నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలు, ముగింపు ఫ్లాట్; మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్, FMCG పతనం
శ్రీలంక LPG కంపెనీ మరియు టెర్మినల్ కోసం ఎనిమిది మంది బిడ్డర్లలో భారత్ పెట్రోలియం
భారతదేశంలో కొత్త కొడియాక్, ఆక్టేవియాను పరిచయం చేయడానికి స్కోడా సిద్ధమైంది
IRFC, RVNL మరియు IRCTC వంటి రైల్వే స్టాక్‌లు నేడు ఎందుకు లాభపడుతున్నాయి??
ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వీపీ హేమంత లాంబా రాజీనామా
'మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తాం': వినియోగదారులు గ్లిచ్ తర్వాత జెరోధాను