తిరుమల లడ్డూ కేసులో సిట్ దర్యాప్తు నిలిపివేత

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నూనెలో కల్తీ జంతువుల కొవ్వు కలిసిందన్న నేపథ్యంలో ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా తిరుపతిలో సిట్ సభ్యులు మోహరించి ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. 

కానీ నేడు ఒక ముఖ్యమైన మార్పు జరిగింది. సిట్‌ విచారణను నిలిపివేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. లడ్డూ కల్తీ  కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు, ప్రభుత్వం  లాయర్ల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టులో తదుపరి విచారణ (అక్టోబర్ 3) తర్వాత సిట్ విచారణను పునఃప్రారంభిస్తామని డీజీపీ తెలిపారు.

About The Author: న్యూస్ డెస్క్