ఐపీఓకు ఇన్సూరెన్స్ కంపెనీ.. విరాట్ కోహ్లీ దంపతులకు కోట్లల్లో లాభం.. ఎక్కడ లిస్ట్ కావొచ్చంటే?

ఐపీఓకు ఇన్సూరెన్స్ కంపెనీ.. విరాట్ కోహ్లీ దంపతులకు కోట్లల్లో లాభం.. ఎక్కడ లిస్ట్ కావొచ్చంటే?

స్టాక్ మార్కెట్లలో ఐపీఓలకు అదిరిపోయే రెస్పాన్స్ ఉంటుంది. చాలా వరకు లిస్టింగ్‌తోనే అద్భుత లాభాలు అందిస్తుంటాయి. అందుకే వీటిల్లో ఇన్వెస్ట్ చేసేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు ఒక కంపెనీ ఐపీఓకు రాబోతుంది. దీంట్లో ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ దంపతులకు షేర్లు ఉండగా.. వీరికి లిస్టింగ్‌తోనే కోట్లల్లో లాభం అందనుంది. ఆ వివరాలు చూద్దాం.

టీమిండియాకు చెందిన దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు స్టాక్ మార్కెట్లలో ఇప్పుడు ఒక ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) ద్వారా బంపర్ రిటర్న్స్ అందుకోనున్నారు. ఏకంగా మల్టీబ్యాగర్ రిటర్న్స్ వీరికి అందనున్నాయి. బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేసే ఇన్సూరెన్స్ స్టార్టప్ గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్.. ఐపీఓకు రాబోతుంది. కొద్ది రోజుల కిందట దీనిపై ప్రకటన రాగా.. మరికొద్ది రోజుల్లో ఇది లిస్టింగ్ కానుంది. ఇప్పటికే ప్రైస్ బ్యాండ్స్ (ధరల శ్రేణి) కూడా వచ్చేసింది. ఐపీఓ అప్పర్ ప్రైస్ బ్యాండ్ రూ. 272 కాగా.. వీరికి మొత్తం రూ. 2.5 కోట్ల విలువైన పెట్టుబడులు ఉండగా.. అది ఈ ధరతో ఏకంగా రూ. 9.06 కోట్లు కానుంది. అంటే ఇక్కడే దాదాపు రూ. 7 కోట్లకుపైగా లాభం రానుంది.

సాధారణంగా ఐపీఓ ఇష్యూ ప్రైస్ కంటే ఎక్కువ ప్రీమియంతోనే లిస్టవుతుంటాయి. ఇప్పుడు దీని ధరల శ్రేణి కనిష్టంగా రూ. 258 నుంచి గరిష్టంగా రూ. 272 గా నిర్ణయించింది సంస్థ. అయితే గ్రే మార్కెట్లో ఇప్పటికే ఈ ఐపీఓ ధర రూ. 50 ప్రీమియంతో ట్రేడవుతోంది. అంటే దాదాపు రూ. 322 వద్ద లిస్టవుతుందని అంచనా. ఈ లెక్కన వీరి లాభాలు మరింత పెరగనున్నాయి. స్టాక్ అక్కడి నుంచి ఎంత పెరిగితే అంత మేర రిటర్న్స్ ఎక్కువగా వస్తాయి.

2020 జనవరి నెలలో విరాట్ కోహ్లీ.. గో డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక్కో షేరుకు రూ. 75 చొప్పున మొత్తం 2,66,667 షేర్లను కొనుగోలు చేశారు. దీని పెట్టుబడి మొత్తం విలువ రూ. 2 కోట్లుగా ఉంది. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా రూ. 50 లక్షల విలువైన ఈ సంస్థ షేర్లు కొనుగోలు చేశారు. మే 15-17 మధ్య గో డిజిట్ ఐపీఓకు రాబోతుంది. దీని ద్వారా రూ. 2615 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రస్తుతం అప్పర్ ప్రైస్ బ్యాండ్ రూ. 272 తో చూస్తేనే విరాట్ పెట్టుబడి అయిన రూ. 2 కోట్లు ఏకంగా రూ. 7.25 కోట్లకు చేరనుంది. లిస్టింగ్ గెయిన్స్ ఇంకా ఎక్కువ ఉంటే.. ఇది మరింత పెరుగుతుందని చెప్పొచ్చు. అనుష్క శర్మకు మొత్తం రూ. 50 లక్షలకు 66,667 షేర్లు రాగా.. అప్పర్ ప్రైస్ బ్యాండ్‌తో అది రూ. 1.81 కోట్లకు చేరుతుంది.

విరాట్ కోహ్లీ సంపద గురించి చెప్పాలంటే ప్రపంచంలోనే 100 మంది అత్యంత ధనవంతులైన క్రీడాకారుల్లో ఒకరిగా ఉన్నాడు. విరాట్ నికర సంపద విలువ రూ. 1000 కోట్లకుపైనే ఉంటుంది. విరాట్ భార్య అనుష్క శర్మ సంపద రూ. 300 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం. ఈమె ఇప్పటికే చాలా హిట్ సినిమాల్లో నటించగా బాగానే ఆర్జించింది. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించడం విశేషం.

తాజా వార్తలు

ఏపీలో రేషన్ పంపిణీపై కీలక నిర్ణయం ఏపీలో రేషన్ పంపిణీపై కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ పంపిణీపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్‌డియు (మొబైల్ డిస్‌పెన్సింగ్ యూనిట్) వాహన నిర్వాహకులు గత పరిపాలనలో...
ఆ ఒక్క రోజు దర్శన సమయం మార్పు
రూ.60వేల కోట్లతో భారీ ప్రాజెక్ట్
సీతారామన్‌తో చంద్రబాబు భేటీ
పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు: ఓఆర్‌ఆర్‌ అబ్దుల్లాపూర్‌మెట్‌
నిరుద్యోగ యువత నిరసనతో టీజీపీఎస్సీ కార్యాలయాన్ని పటిష్టం
హైదరాబాద్ సెయిలింగ్ వీక్‌లో రితికకు డబుల్ డిలైట్