తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సమరం నేడే.. త్రిముఖ పోరులో గెలిచేదెవరు..?

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సమరం నేడే.. త్రిముఖ పోరులో గెలిచేదెవరు..?

తెలంగాణలో నేడు లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 36 వేల పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రంలో త్రిముఖ పోరు నెలకొననుంది. ఇటీవలే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. మోదీ హవా తమకు కలిసి వస్తుందని బీజేపీ ఆశాభవంతో ఉండగా.. బీఆర్ఎస్ పునర్వైభవం కోసం ప్రయత్నిస్తోంది.

  • తెలంగాణలో నేడే లోక్ సభ ఎన్నికలు
  • కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోరు
  • అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ వెనుకంజ
  • సార్వత్రిక ఎన్నికల నాలుగో దశలో భాగంగా తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో నేడు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 3.2 కోట్ల మంది ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. లోక్ సభ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం తెలంగాణలో 35,809 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పోలింగ్ సాఫీగా సాగడం కోసం.. 175 కంపెనీల కేంద్ర బలగాలతోపాటు తెలంగాణ పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
  • రాష్ట్రంలో ఈసారి త్రిముఖ పోరు నెలకొంది. ఈ లోక్ సభ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
  • కంటోన్మెంట్ ఉపఎన్నిక..

    లోక్ సభ ఎన్నికలతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉపఎన్నిక సైతం నేడు జరగనుంది. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్య నందిత ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో కంటోన్మెంట్ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ నుంచి లాస్య నందిత సోదరి నివేదిత పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేశ్, బీజేపీ నుంచి వంశీ తిలక్ బరిలో ఉన్నారు.
  • కాంగ్రెస్‌కు కీలకం..

    గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లపాటు మనుగడ సాగించాలంటే.. లోక్ సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లను సాధించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరోవైపు బీజేపీపై సైతం లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ, అమిత్ షా లాంటి అగ్ర నేతలు బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సైతం బీజేపీని టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పించింది.
  • బీఆర్ఎస్‌ ఆరాటం..

    గత లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించిన బీఆర్ఎస్.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఈసారి ఢీలా పడింది. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉండనుందనే అంచనాలు ఉన్నాయి. అయితే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా మళ్లీ రేసులోకి రావాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది.
  • కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది నేతలు పార్టీని వీడటం గులాబీ పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. వరంగల్ టికెట్‌ను కేసీఆర్ ముందుగా కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు కేటాయించారు. అయినప్పటికీ కడియం, ఆయన కుమార్తె కాంగ్రెస్‌లో చేరారు. కావ్య కాంగ్రెస్ అభ్యర్థిగా వరంగల్ నుంచి పోటీలో ఉన్నారు.
  • గతంలో ఇలా..

    2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 88 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. కానీ ఆరు నెలలలోపే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇదే ఆధిక్యాన్ని చెలాయించలేకపోయింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో 16 సీట్లు సాధించాలని టార్గెట్‌గా పెట్టుకున్న బీఆర్ఎస్ 9 సీట్లకే పరిమితమైంది. బీజేపీ అనూహ్యంగా 4 చోట్ల విజయం సాధించగా.. కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో, ఎంఐఎం ఒక చోట గెలుపొందాయి. గత లోక్ సభ ఎన్నికల్లో మోదీ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఈసారి తెలంగాణలో తాము డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని బీజేపీ నేతలు నమ్మకంతో ఉన్నారు.
Tags: Telangana

తాజా వార్తలు

2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా  2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా
యూఎస్‌ఏ, వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు విజయాన్ని అందించిన తర్వాత ఇటీవలే టీ20ల నుంచి రిటైరయిన రోహిత్ శర్మ వచ్చే ఏడాది జరగబోయే రెండు ముఖ్యమైన...
నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలు, ముగింపు ఫ్లాట్; మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్, FMCG పతనం
శ్రీలంక LPG కంపెనీ మరియు టెర్మినల్ కోసం ఎనిమిది మంది బిడ్డర్లలో భారత్ పెట్రోలియం
భారతదేశంలో కొత్త కొడియాక్, ఆక్టేవియాను పరిచయం చేయడానికి స్కోడా సిద్ధమైంది
IRFC, RVNL మరియు IRCTC వంటి రైల్వే స్టాక్‌లు నేడు ఎందుకు లాభపడుతున్నాయి??
ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వీపీ హేమంత లాంబా రాజీనామా
'మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తాం': వినియోగదారులు గ్లిచ్ తర్వాత జెరోధాను