తెలంగాణలో పదిరోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్ల బంద్

తెలంగాణలో పదిరోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్ల బంద్

  • పదిమంది కోసం షో వేయలేం.. అందుకే బంద్
  • ఓవైపు ఎన్నికలు, మరోవైపు ఐపీఎల్ తో థియేటర్ల వైపు చూడని జనం
  • పెద్ద సినిమాల విడుదల వాయిదా.. చిన్న సినిమాలకు ఆదరణ కరవు

వేసవి సెలవుల్లో పెద్ద సినిమాలు ఎక్కువగా విడుదలవుతుంటాయి. సెలవుల కారణంగా థియేటర్లకు జనం ఎక్కువగా వస్తారని భావించి, మూడు గంటలు ఏసీలో సినిమా చూసి ఎంజాయ్ చేయడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. అందుకనే ఈ సమయంలో పెద్ద సంఖ్యలో సినిమాలు విడుదలవుతుంటాయి. కానీ ఈసారి పరిస్థితి మారింది. ప్రధాన నిర్మాతలు తమ సినిమాల విడుదలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నారు.

ఓవైపు దేశవ్యాప్తంగా ఎన్నికలు, మరోవైపు ఐపీఎల్ మ్యాచ్‌లు జరగడం వలన ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. ఈ పరిణామం సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులపై భారీ ప్రభావాన్ని చూపిస్తోంది. తెలంగాణలో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుందని థియేటర్ యజమానులు చెబుతున్నారు.

ఎన్నికలు, ఐపీఎల్ కారణంగా సినిమా చూసే జనం తక్కువగా ఉన్నారని తెలిపారు. సమ్మర్ ప్రారంభమైనప్పటి నుంచి నష్టాలు తప్పలేదని సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు వాపోతున్నారు. ఒక్కో షోకు పది, పదిహేను మంది మాత్రమే రావడం వలన, టికెట్ల ద్వారా వచ్చిన డబ్బు కరెంట్ బిల్లుకి కూడా సరిపోవడంలేదని చెబుతున్నారు. పదిమంది ప్రేక్షకుల కోసం షో వేయడం సాధ్యం కాక, రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లను పది రోజుల పాటు బంద్ చేయాలని నిర్ణయించారు.

ఈ నిర్ణయం చిన్న సినిమాల నిర్మాతలకు భారంగా మారనుందని భావిస్తున్నారు. ఈ వారంలో పలు చిన్న సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే, సింగిల్ స్క్రీన్ థియేటర్ల బంద్ కారణంగా ఈ సినిమాలు విడుదలవుతాయా లేదా వాయిదా పడతాయా అనేది చూడాలి.

తాజా వార్తలు

2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా  2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా
యూఎస్‌ఏ, వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు విజయాన్ని అందించిన తర్వాత ఇటీవలే టీ20ల నుంచి రిటైరయిన రోహిత్ శర్మ వచ్చే ఏడాది జరగబోయే రెండు ముఖ్యమైన...
నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలు, ముగింపు ఫ్లాట్; మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్, FMCG పతనం
శ్రీలంక LPG కంపెనీ మరియు టెర్మినల్ కోసం ఎనిమిది మంది బిడ్డర్లలో భారత్ పెట్రోలియం
భారతదేశంలో కొత్త కొడియాక్, ఆక్టేవియాను పరిచయం చేయడానికి స్కోడా సిద్ధమైంది
IRFC, RVNL మరియు IRCTC వంటి రైల్వే స్టాక్‌లు నేడు ఎందుకు లాభపడుతున్నాయి??
ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వీపీ హేమంత లాంబా రాజీనామా
'మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తాం': వినియోగదారులు గ్లిచ్ తర్వాత జెరోధాను