స్నానానికి వెళ్లి ఇద్దరు స్నేహితులు మృతి!
On
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద ఇద్దరు స్నేహితులు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. విశాఖ జిల్లా గాజువాకకు చెందిన బంగారి జగన్ (18), దిమిలికి చెందిన శ్రీను (18) ఇద్దరు మంచి స్నేహితులు. బుధవారం ఎలమంచిలి తెరువుపల్లి సమీపంలోని చిన్న శారద నదిలో ఈతకు వెళ్లారు.
స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు శ్రీను గోతిలో పడి మునిగిపోగా, జగన్ కాపాడే ప్రయత్నం చేయగా అతడు కూడా జారి గోతిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు ఇద్దరినీ రక్షించేందుకు ప్రయత్నించారు. అప్పటికే శ్రీను మృతి చెందగా, ఊపిరి పీల్చుకున్న జగన్‌ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జగన్ మృతి చెందడంతో ఇరు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Related Posts
తాజా వార్తలు
17 Nov 2024 12:34:07
పాఠశాలకు సరిగా వెళ్లడంలేదని ఆగ్రహించిన తండ్రి సెల్‌ఫోన్ రిపేర్‌కు డబ్బులు ఇవ్వాలని కొడుకు అడగడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.చదువుకుని గొప్పవాడివి కావాలని మేం కష్టపడి నిన్ను