బెంగళూరులో విషాదం క్రికెట్ బ్యాట్ తో కొడుకును కొట్టిచంపిన తండ్రి..

బెంగళూరులో విషాదం క్రికెట్ బ్యాట్ తో కొడుకును కొట్టిచంపిన తండ్రి..

 పాఠశాలకు సరిగా వెళ్లడంలేదని  ఆగ్రహించిన తండ్రి సెల్‌ఫోన్ రిపేర్‌కు డబ్బులు ఇవ్వాలని కొడుకు అడగడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.చదువుకుని గొప్పవాడివి కావాలని మేం కష్టపడి నిన్ను స్కూలుకు పంపిస్తుంటే, స్కూలుకు వెళ్లకుండా నువ్వు చేస్తున్నదేంటని  అంటూ కొట్టడం మొదలుపెట్టాడు. కోపంతో విచక్షణ  మరిచి క్రికెట్ బ్యాట్‌తో బలంగా  గోడకు  తల పగలగొట్టాడు. 14 ఏళ్ల బాలుడు గాయాలతో మృతి చెందాడు. బెంగళూరులో శుక్రవారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కాష్నినగర్ కు  చెందిన రవికుమార్‌(40) కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతను తన భార్య శశికళ మరియు కుమారుడు తేజస్ . తేజస్ స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అయితే రవికుమార్ తన కొడుకు క్లాసులకు సరిగ్గా హాజరుకావడం లేదని, ఎప్పుడు చూసినా ఫోన్‌తో ఆడుకుంటున్నాడని దూషించేవాడు. వాళ్లు కష్టపడి చదివిస్తున్నప్పుడు కొడుకు చదువును నిర్లక్ష్యం చేయడం తట్టుకోలేకపోయేవాడు . ఈ క్రమంలో శుక్రవారం తన మొబైల్‌ రిపేర్‌ చేసేందుకు డబ్బులు డిమాండ్‌ చేయడంతో తేజస్‌పై రవికుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇంట్లోని క్రికెట్ బ్యాట్ తో కొడుకును కొట్టాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన భార్యపైనా మండిపడ్డాడు. అప్పటికీ కోపం తగ్గక ‘నువ్వు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే’ అంటూ కొడుకు తలను గోడకేసి కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి తేజస్ స్పృహ కోల్పోయాడు. కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా రవికుమార్ అడ్డుకున్నాడు. తేజస్ ను అలాగే వదిలేసి కాసేపటి తర్వాత బయటకు వెళ్లిపోయాడు. ఎంతసేపటికి లేవకపోవడంతో చుట్టుపక్కల వారి సాయంతో శశికళ తన కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లింది.

అయితే అప్పటికే తేజస్‌ తీవ్రగాయాలతో రక్తస్రావంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పరిస్థితిని తెలుసుకున్న రవికుమార్‌ ఆస్పత్రికి వచ్చారు. ఇది చూసిన శశికళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. తేజస్ మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

 

Tags:

Related Posts

తాజా వార్తలు

బెంగళూరులో విషాదం క్రికెట్ బ్యాట్ తో కొడుకును కొట్టిచంపిన తండ్రి.. బెంగళూరులో విషాదం క్రికెట్ బ్యాట్ తో కొడుకును కొట్టిచంపిన తండ్రి..
  పాఠశాలకు సరిగా వెళ్లడంలేదని  ఆగ్రహించిన తండ్రి సెల్‌ఫోన్ రిపేర్‌కు డబ్బులు ఇవ్వాలని కొడుకు అడగడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.చదువుకుని గొప్పవాడివి కావాలని మేం కష్టపడి నిన్ను
ఒమర్ అబ్దుల్లా J&K ముఖ్యమంత్రిగా, సురీందర్ చౌదరి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
కేవలం 1,000 స్పాట్‌లతో ఆస్ట్రేలియా వర్క్ మరియు హాలిడే వీసా కోసం 40,000 మంది భారతీయులు దరఖాస్తు చేసుకున్నారు
హర్యానాలోని ఫార్మాస్యూటికల్ సంస్థ ఉద్యోగులకు 15 కార్లను బహుమతిగా ఇచ్చింది
ఇజ్రాయెల్ చూపిన గదులు, ఆయుధాలు మరియు వాహనాలతో కూడిన సొరంగం
బాంబు బెదిరింపు కారణంగా కెనడాకు దారి మళ్లించిన ఎయిర్ ఇండియా విమానం చికాగోకు మళ్లించబడింది
జైపూర్ డైరీ: పర్యాటక అవకాశం కోసం పెట్టుబడి సదస్సు