పెన్షన్ లపై ప్రభుత్వ అబద్దాలు, తప్పుడు ప్రచారాలు జగన్ నీచ రాజకీయాలకు నిదర్శనం - గళ్ళా మాధవి

పెన్షన్ లపై ప్రభుత్వ అబద్దాలు, తప్పుడు ప్రచారాలు జగన్ నీచ రాజకీయాలకు నిదర్శనం - గళ్ళా మాధవి

గుంటూరు సిటీ ఏప్రిల్ 2: పెన్షన్ లపై ప్రభుత్వ అబద్దాలు, తప్పుడు ప్రచారాలు జగన్ నీచ రాజకీయాలకు నిదర్శనమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గళ్ళా మాధవి పేర్కొన్నారు. మంగళవారం పెన్షన్ల పంపిణీని వేగవంతం చేసే విధంగా ఆదేశాలివ్వాలని కోరుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తహసీల్దార్ కు గళ్ళ మాధవి టీడీపీ నాయకులతో కలిసి వినతిపత్రం అందేజేశారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ...• 1వ తేదీ ఇంటి వద్దనే పెన్షన్ అందించే విషయంలో ప్రభుత్వం విఫలం అయ్యింది.

  • వృద్ధులు, వికలాంగులకు మానవీయ కోణంలో పెన్షన్ ఇంటి వద్దనే ఇవ్వాల్సిన అవసరం ఉంది.
  • కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత జగన్ రెడ్డి 15 రోజుల్లో రూ.13 వేల కోట్లు కాంట్రాక్టర్లకు దోచి పెట్టారు.
  • వాలంటీర్లను ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వాడుతున్న కారణంగా వారిని కేంద్ర ఎన్నికల సంఘం విధులకు దూరం పెట్టింది.
  • పెన్షన్ లు పంపిణీ చేయవద్దని తెలుగు దేశం ఎవరినీ కోరలేదు....కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పలేదు.
  • 1.35 లక్షల మంది సచివాలయం సిబ్బందితో ఉన్నారు. వారి ద్వారా ఒక్క రోజులో ఇంటింటింకీ పెన్షన్ ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం చేయలేదు.
  • ప్రభుత్వ పథకాలకు ఇవ్వాల్సిన డబ్బులు.. సొంత కాంట్రాక్టర్లు ఇచ్చారు.
  • ఖజానా ఖాళీ చేసి పెన్షన్ ఇవ్వ లేకపోయిన ప్రభుత్వం...ఆ నెపాన్ని టీడీపీ పై, ఎన్నికల సంఘంపై నెడుతోంది.
  • ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ విషయంలో వైసీపీ ప్రభుత్వ కుట్రలు,వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి
  • టీడీపీ వచ్చాక రూ. 4 వేల పెన్షన్ ఇంటింటికీ ఇస్తాం.... రెండు మూడు నెలలు తీసుకోకపోయినా అన్నీ కలిపి ఇస్తాం.

తాజా వార్తలు

బెంగళూరులో విషాదం క్రికెట్ బ్యాట్ తో కొడుకును కొట్టిచంపిన తండ్రి.. బెంగళూరులో విషాదం క్రికెట్ బ్యాట్ తో కొడుకును కొట్టిచంపిన తండ్రి..
  పాఠశాలకు సరిగా వెళ్లడంలేదని  ఆగ్రహించిన తండ్రి సెల్‌ఫోన్ రిపేర్‌కు డబ్బులు ఇవ్వాలని కొడుకు అడగడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.చదువుకుని గొప్పవాడివి కావాలని మేం కష్టపడి నిన్ను
ఒమర్ అబ్దుల్లా J&K ముఖ్యమంత్రిగా, సురీందర్ చౌదరి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
కేవలం 1,000 స్పాట్‌లతో ఆస్ట్రేలియా వర్క్ మరియు హాలిడే వీసా కోసం 40,000 మంది భారతీయులు దరఖాస్తు చేసుకున్నారు
హర్యానాలోని ఫార్మాస్యూటికల్ సంస్థ ఉద్యోగులకు 15 కార్లను బహుమతిగా ఇచ్చింది
ఇజ్రాయెల్ చూపిన గదులు, ఆయుధాలు మరియు వాహనాలతో కూడిన సొరంగం
బాంబు బెదిరింపు కారణంగా కెనడాకు దారి మళ్లించిన ఎయిర్ ఇండియా విమానం చికాగోకు మళ్లించబడింది
జైపూర్ డైరీ: పర్యాటక అవకాశం కోసం పెట్టుబడి సదస్సు