మూగబోయిన మైకులు..! ప్రచారానికి తెర, అమల్లో ఉండే ఆంక్షలివే..!!

మూగబోయిన మైకులు..! ప్రచారానికి తెర, అమల్లో ఉండే ఆంక్షలివే..!!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ నెల రోజులుగా హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఎన్నికల ప్రచారానికి తెర పడింది. మే 11 శనివారం సాయంత్రం 5 గంటలతో ప్రచారపర్వానికి తెరపడింది.ఐదు గంటలకు ప్రచారపర్వం ముగిసిపోవటంతో.. రాష్ట్రమంతా  ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయింది. హైదరాబాద్‌.... తెలంగాణలో స్థిరపడిన ఏపీ ఓటర్లు ఓట్ల పండుగ కోసం ఏపీలోని తమ ఊర్లకు లక్షలాదిగా వస్తున్నారు.

ఆంక్షలివే.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలే..

★ ఎన్నికలు ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.

★ ఐదుగురు మించి ఎక్కడైనా గుమిగూడితే చర్యలు తీసుకుంటారు.

★ ఎన్నికలు ముగిసే వరకు రెండు రోజుల పాటు (మే 11 సాయంత్రం 5 గంటల నుంచి మే 13 సాయంత్రం 6 గంటల వరకు) వైన్ షాపులు, బార్లు మూసి ఉంచుతారు. లిక్కర్ అమ్మకాలు నిషిద్ధం.

★ పోలింగ్ ముంగిట ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి కాబట్టి పోలీసులు డేగ కన్ను వేస్తారు.

★ ఎన్నికల ఊరేగింపులు, ర్యాలీలు, సినిమాలు, టీవీల ద్వారా ప్రచారం నిర్వహించడం నిషిద్ధం.

★ మొబైల్స్‌ ద్వారా ఎన్నికల సందేశాలను పంపించడం, ఒపీనియన్‌ సర్వేలు వెల్లడించడం నిషిద్ధం.

★ ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల జైలు శిక్ష లేదా భారీ జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంటుంది.

తాజా వార్తలు

2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా  2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా
యూఎస్‌ఏ, వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు విజయాన్ని అందించిన తర్వాత ఇటీవలే టీ20ల నుంచి రిటైరయిన రోహిత్ శర్మ వచ్చే ఏడాది జరగబోయే రెండు ముఖ్యమైన...
నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలు, ముగింపు ఫ్లాట్; మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్, FMCG పతనం
శ్రీలంక LPG కంపెనీ మరియు టెర్మినల్ కోసం ఎనిమిది మంది బిడ్డర్లలో భారత్ పెట్రోలియం
భారతదేశంలో కొత్త కొడియాక్, ఆక్టేవియాను పరిచయం చేయడానికి స్కోడా సిద్ధమైంది
IRFC, RVNL మరియు IRCTC వంటి రైల్వే స్టాక్‌లు నేడు ఎందుకు లాభపడుతున్నాయి??
ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వీపీ హేమంత లాంబా రాజీనామా
'మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తాం': వినియోగదారులు గ్లిచ్ తర్వాత జెరోధాను