49మంది జల సమాధి మరో 140మంది గల్లంతు
యెమెన్ తీరంలో పడవ బోల్తా పడటంతో 49 మంది శరణార్థులు మరణించారు. వీరిలో 31 మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఈ దుర్ఘటన సోమవారం జరిగినట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) మంగళవారం ప్రకటించింది. మరో 140 మంది ఆచూకీ తెలియలేదు.ఈ బోటు సోమాలియా నుంచి యెమెన్‌కు వెళ్తోంది. యెమెన్‌లోని సబ్‌వా ప్రావిన్స్‌లో అల్గరీఫ్ పాయింట్ సమీపంలో పడవ బోల్తా పడింది. ఈ సమయంలో పడవలో 260 మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది సోమాలియా మరియు ఇథియోపియా నుండి వచ్చారు. వారిలో 90 మంది మహిళలు.తప్పిపోయిన వారి కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినట్లు IOM మంగళవారం ప్రకటించింది. ఆరుగురు చిన్నారులు సహా 70 మందిని రక్షించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.యెమెన్ తీర ప్రాంతాల్లో సరైన రెస్క్యూ బోట్లు లేకపోవడం, వాటి రాక ఆలస్యం కావడం వల్ల మృతుల సంఖ్య పెరగడానికి కారణమని వారు తెలిపారు.అనేక మంది ప్రాణాలను కాపాడడంలో స్థానిక నివాసితులు మరియు మత్స్యకారులు కీలక పాత్ర పోషించారని IOM అధికారులు తెలిపారు.