మణిపూర్ ముఖ్యమంత్రి వీధిలో భారీ అగ్నిప్రమాదం!
ఇంఫాల్‌లోని సీఎం అధికారిక నివాసం సమీపంలో ప్రమాదం
శనివారం సాయంత్రం ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రమాదం జరిగిన ఇల్లు గోవా మాజీ సెక్రెటరీదని చెందినదని, ఏడాది కాలంగా ఖాళీగా ఉందని అధికారులు తెలిపారు.
పోలీసులు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
ఇంఫాల్ నగరంలోని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ అధికారిక నివాసానికి ఎదురుగా ఉన్న ఇంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించి గందరగోళం నెలకొంది. ఈ సంఘటన శనివారం సాయంత్రం 5:30 గంటలకు జరిగింది.ఆ ఇల్లు గోవా మాజీ చీఫ్ సెక్రెటరీ థాంగ్‌కోఫావ్ కిప్‌జెన్‌కు చెందినదని పోలీసులు తెలిపారు. 2005లో కిప్‌జెన్ మరణించిన తర్వాత, అతని కుటుంబం కొంత కాలం పాటు ఇంట్లో నివసించింది.అయితే, ఏడాది పాటు ఇల్లు ఖాళీగా ఉంది. ఇంటి పైకప్పు చెక్కతో ఉండడంతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.సుమారు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.