హైదరాబాద్‌లో అక్రమ మద్యం ఉత్పత్తి చేస్తున్న డిస్టిలరీపై కేసు నమోదు!
On
హైదరాబాద్‌లో అక్రమంగా మద్యం ఉత్పత్తి చేస్తున్న బగ్గా డిస్టిలరీపై కేసు నమోదైంది. బగ్గా డిస్టిలరీ జీఎం, ఎండీ తదితరులపై కేసు నమోదైంది. జిఎం డిస్టిలర్ బి.రమేష్‌ను అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. మరికొందరు పరారైనట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు భారీ ఎత్తున అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ లేబుళ్లతో మద్యం అక్రమ రవాణా చేస్తూ ప్రభుత్వానికి పన్నులు ఎగవేస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగా ఎక్సైజ్ అధికారులు డిస్టిలరీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమ మార్కింగ్‌లతో మద్యం రవాణా చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. డిస్టిలరీ డైరెక్టర్‌తో పాటు పలువురు వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. సుమారు 10 వేల మద్యం కేసులను సీజ్ చేశారు.
Tags:
Related Posts
తాజా వార్తలు
బెంగళూరులో విషాదం క్రికెట్ బ్యాట్ తో కొడుకును కొట్టిచంపిన తండ్రి..
17 Nov 2024 12:34:07
పాఠశాలకు సరిగా వెళ్లడంలేదని ఆగ్రహించిన తండ్రి సెల్‌ఫోన్ రిపేర్‌కు డబ్బులు ఇవ్వాలని కొడుకు అడగడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.చదువుకుని గొప్పవాడివి కావాలని మేం కష్టపడి నిన్ను